Wednesday, May 1, 2024

ఇజ్రాయెల్ పార్లమెంట్ వివాదాస్పద బిల్లుకు ఆమోదం

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: సుప్రీం కోర్టు అధికారాలను నియంత్రిస్తూ ఇజ్రాయెల్ పార్లమెంట్ సోమవారం వివాదాస్పద బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రజల ఆందోళనల మధ్య దీన్ని ఆమోదించింది. కోర్టుల పరిధిని తగ్గిస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వం న్యాయసంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగానే సర్వోన్నత న్యాయస్థానం అధికారాలకు కత్తెర వేస్తూ తాజాగా బిల్లును ఆమోదించింది. అయితే ఈ సంస్కరణలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది తీవ్ర విఘాతం కలిగిస్తుందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తాజా సంస్కరణల ప్రకారం ఇకపై క్యాబినెట్ నిర్ణయాలు, నియామకాలను కోర్టులు పరిశీలించడానికి వీలుండదు. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News