Wednesday, May 8, 2024

ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే మార్గనిర్ధేశకాలు జారీ

- Advertisement -
- Advertisement -

South Central Railway

 

మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ఇటీవల కాలంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్ల సమయాలో మార్పులు, చేర్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని స్టేషన్ల నుంచి బయలుదేరే, చేరుకునే రైళ్లు జోన్‌ల మీదుగా ప్రయాణించే రైళ్లు, బయలుదేరే స్టేషన్లు/లేదా) మార్గమధ్యంలోని స్టేషన్లు/లేదా) గమ్యస్థానాల ద్వారా ప్రయాణించే రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేసినట్టు రైల్వే శాఖ తెలిపింది. దీనికోసం ఇంటిగ్రేటెడ్ ఎంక్వయిరీ నెం.139 (లేదా) ఎన్‌టిఈఎస్ వెబ్‌సైట్ (లేదా) ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ (లేదా) సమీప రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు / రైల్వేస్టేషన్లలో అధీకృత అధికారి ద్వారా తెలుసుకోవాలని రైల్వే శాఖ తెలిపింది.

ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే వారందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు లోబడి ప్రయాణించాలని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. నిబంధనల్లో భాగంగా ప్రయాణికులు మాస్కు ధరించడం, హ్యాండ్ శానిటైజర్లు ఉపయోగం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి వాటికి ప్రయాణికులు కట్టుబడి ఉండాలని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ విషయంలో ఆరోగ్య మార్గనిర్ధేశకాలను ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ లేదా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్‌ల నుంచి తెలుసుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణికులు సురక్షితమైన ఎటువంటి అవాంతరాలు లేని ప్రయాణాన్ని సాగించేందుకు దక్షిణ మధ్య రైల్వేకు ప్రయాణికులు సహకరించాలని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News