Tuesday, April 30, 2024

రాష్ట్రానికి టెస్లా తెస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లాను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్ర భుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని ఐటి మంత్రి డి.శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 2023 డిసెంబర్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ దిగ్గజ సంస్థల ద్వారా పెట్టుబడి అవకాశాలపై చురుకుగా దృష్టి సారించింది. దీనిలో భాగంగా భారతదేశంలో టెస్లా పెట్టుబడి ప్రణాళికను అధ్యయనం చేస్తున్నామని, వాటిపై ప్రధానంగా దృష్టిపెట్టామని ఎక్స్ (ట్విట్టర్)లో మంత్రి పోస్ట్ చేశారు. కొంతకాలంగా తెలంగాణకు టెస్లాను తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, పరిశ్రమకు అనుకూలమైన విధానంతో తెలంగాణ రాష్ట్రం పని చేస్తోందన్నారు. టెస్లా వంటి దిగ్గజ కంపెనీలు తెలంగాణలో వ్యాపారం చేయడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, స మస్యలు లేని అనుమతుల వ్యవస్థ అవసరం, ఈ దిశగా ప్రయత్నా లు ముమ్మరం చేశామని మంత్రి ఎక్స్‌లో వివరించారు.

తమ బృం దం టెస్లాతో చర్చలు కొనసాగిస్తోందని, తెలంగాణలో టెస్లా ప్లాం ట్‌ను నెలకొల్పేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. అ యితే టెస్లా నిబద్ధతకు తెలంగాణ వెన్నుదన్నుగా నిలిచి, ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాలహబ్‌గా అవతరించేందుకు తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే టెస్లా భారత్‌లో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రోత్సాహానికి కొత్త విధానాలను తీసుకొచ్చింది. దీంతో ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం టెస్లాను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేసింది.

ఈ నెలాఖరులో భారత్‌కు టెస్లా బృందం
కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం తన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ (ఇవి పాలసీ)ని ప్రకటించింది. ఈ పాలసీతో అమెరికన్ ఇవి దిగ్గజం టెస్లాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇవి వాహనాల సంస్థలకు భారత్‌లో ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఈ పాలసీతో స్పష్టత రావడంతో ఇప్పుడు భారతదేశంలోకి టెస్లా ప్రవేశం ఖరారైంది. టెస్లా నుండి ఒక బృందం ఏప్రిల్ చివరిలో భారతదేశానికి రానుంది. భారతదేశంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాన్ని కనుగొనడం ఈ బృందం పని, ఈ టీమ్ దేశంలోని నాలుగు నుంచి ఐదు రాష్ట్రాలపై దృష్టి సారించింది.

2 నుంచి 3 బిలియన్ డాలర్ల విలువైన ప్లాంట్
ఎలోన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారతదేశంలో సుమారు 2 నుండి 3 బిలియన్ డాలర్ల విలువైన ప్లాంట్‌ను నిర్మించడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు ఈనెలలో ఓ బృందం భారత్‌కు రానుంది. ఈ బృందం అనేక రాష్ట్రాలను సందర్శించి ప్లాంట్‌కు అనువైన భూమిని అన్వేషిస్తాయి. అయితే ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పటికే ఉన్న రాష్ట్రాలపై టెస్లా ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం. భారతదేశంలో దాదాపు 24 వేల డాలర్ల విలువైన ఇవి కారును తయారు చేయాలనుకుంటున్నట్లు టెస్లా గత ఏడాది జూలైలో తెలిపింది. గతేడాది జూన్‌లో టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు.

క్షీణించిన టెస్లా అమ్మకాలు
మార్చి త్రైమాసికంలో టెస్లా విక్రయాలు క్షీణించిన తరుణంలో భారత్‌పై కంపెనీ దృష్టిపెట్టడం గమనార్హం. జనవరి, మార్చి మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 3,86,810 వాహనాలను విక్రయించినట్లు టెస్లా తెలిపింది. గత ఏడాది త్రైమాసిక విక్రయాల సంఖ్య 4,23,000తో పోలిస్తే ఇది 9 శాతం క్షీణించింది. టెస్లాపై గట్టి పోటీ కారణంగా అమ్మకాలలో ఈ క్షీణత వచ్చింది. అంతేకాకుండా కొత్త కస్టమర్ల సంఖ్య కూడా తగ్గింది. టెస్లా మోడల్ 3, వై అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 10.3 శాతం క్షీణించి 369,783కి చేరుకున్నాయి.

మార్చిలో భారతదేశ ఇవి పాలసీని ప్రకటించింది..
ఈ ఏడాది మార్చి 15న భారత ప్రభుత్వం కొత్త ఇవి పాలసీని ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల(ఇవి)కు తయారీ గమ్యస్థానంగా భారత్‌ను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్షంగా చేసుకుంది.
ఈ కొత్త పాలసీలో ఒక కంపెనీ దేశంలో 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి, మూడేళ్లలో భారతదేశంలో ఉత్పత్తిని ప్రారంభిస్తే, దిగుమతి పన్నులో మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
కొత్త పాలసీలో విదేశీ కంపెనీలు కనీసం రూ.4,150 కోట్ల పెట్టుబడులు పెట్టాల్సి, గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి చేయొచ్చు. దీనిలో పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.

కొత్త పాలసీ ప్రకారం, కంపెనీలు 3 ఏళ్లలో భారత్‌లో తయారు చేసిన 25 శాతం విడిభాగాలను, 5 ఏళ్లలో కనీసం 50 శాతం భాగాలను ఉపయోగించాల్సి ఉంటుంది.
ఒక కంపెనీ భారతదేశంలో తన ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే, అది భారతదేశంలో 35,000 డాలర్లు (రూ.29 లక్షలు), అంతకంటే ఎక్కువ ధర కలిగిన కార్లను అసెంబ్లింగ్ చేయడానికి 15 శాతం కస్టమ్స్ డ్యూటీని చెల్లించాలి. ఈ సదుపాయం 5 ఏళ్ల పాటు అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News