Thursday, May 2, 2024

ఖమ్మం బాలుడిని దత్తత తీసుకున్న ఇటలీ దంపతులు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఖమ్మం నగరానికి చెందినబాలుడిని ఇటలీ దేశానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్ళితే ఖమ్మం జిల్లా బాలల సంరక్షణాలయానికి చెందిన బాబును కారా నిబంధనల మేరకు చట్ట ప్రకారం ఇటలీకి చెందిన దంపతులకు నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ దత్తత ఇచ్చారు. సోమవారం ఐడిఓసిలోని కలెక్టర్ ఛాంబర్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా దత్తత పక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులకు దత్తత ఒక వరమని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ అన్నారు. జిల్లాలో గల 18 సంవత్సరాలలోపు బాలబాలికలు (అనాథ,

వదిలేసిన, స్థోమత లేని తల్లిదండ్రులు) చట్టప్రకారం దత్తత ప్రక్రియలోకి తీసుకొచ్చి, జిల్లా కలెక్టర్ ద్వారా కారా నిబంధనల మేరకు దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. పిల్లలు లేని దంపతులు www.cara.nic.in వెబ్ సైట్ ద్వారా 18 సంవత్సరాల లోపు పిల్లలను దత్తత తీసుకోవచ్చని, దత్తత ప్రక్రియ గురించి అంగన్‌వాడీ టీచర్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, శిశుగృహాన్ని సంప్రదించాలని, దత్తత ద్వారా ఇట్టి అవకాశాన్ని పిల్లలు లేని దంపతులు వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి జి.జ్యోతి, డిసిపిఓ విష్ణు వందన, ప్రొటెక్షన్ అధికారిణి సోని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News