Friday, May 3, 2024

కుటుంబ నియంత్రణ కోసం అవగాహన సదస్సులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, పీహెచ్‌సీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అదనపు డైరెక్టర్ డా. రవీందర్‌నాయక్ తెలిపారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఉత్తమ సేవలందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో సత్కరించనట్లు జనాభా దినోత్సవం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడుతలుగా పక్షోత్సవాలలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్ 27 నుంచి జూలై 10వరకు మొదటి పక్షోత్సవం కాగా, జూలై 11 నుంచి జూలై 24 వరకు రెండో పక్షోత్సవం జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ పక్షోత్సవాల్లో జనాభా పెరుగుదల, అధిక జనాభాతో కలిగే అనర్ధాలు గుర్తించి ప్రచారం చేసినట్లు, అంతేగాకుండా కుటుంబ నియంత్రణకు అందుబాటులో ఉన్నవివిధ రకాల తాత్కాలిక , శాశ్వత పద్దతుల గురించి అవగాహన కల్పించినట్లు తెలిపారు.

అదేవిధంగా నేటి నుంచి ప్రారంభమై రెండో పక్షోత్సవాల్లో కోవిడ్ నిబంధనలను అమలు చేస్తూ తాత్కాలిక పద్దతులు, కుటుంబ నియంత్రణ శాశ్వత పద్దతులతో క్యాంప్‌లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈక్యాంపుల్లో అర్హులైన పురుషులకు వ్యాసెక్టమీ, స్త్రీలకు ట్యూబెక్టమీ ఆపరేషన్‌లు చేయనున్నట్లు చెప్పారు. బిడ్డల మధ్య తేడా ఉండేందుకు అందుబాటులో ఉన్న తాత్కాలిక నియంత్రణ పద్దతులు అంతర ఇంజెక్షన్ మూడు నెలలకు ఒకసారి, మాల ఎన్ నోటి మాత్రలు, చాయ నోటి మాత్రలు, అత్యవసర గర్భనిరోధక మాత్ర, కాపర్ టి, నిరోధ్‌లాంటి తాత్కాలిక పద్దతుల గురించి అవగాహన కల్పించి అర్హులైన వారిని ఆచరించే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అయిన వ్యాసెక్టమీ, ట్యుబెక్టమీ చేయించుకున్న వారికి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్దతులైన అంతర ఇంజెక్షన్ వేయించుకున్న వారికి నగదు ప్రోత్సహకాలు అందిస్తామని తెలిపారు. గత సంవత్సరం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్దతుల సాధించామని, శాశ్వత కుటుంబ నియంత్రణ పద్దతులైన ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్న స్త్రీలు 1,14,141 మంది, వ్యాసెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్న పురుషులు 3229 మంది ఉన్నట్లు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News