Thursday, May 2, 2024

ఆ బిల్లుతో ఆహార కొరత: జగదీష్

- Advertisement -
- Advertisement -

Jagadeesh strike against Farmers bill

హైదరాబాద్: రైతుల ఆగ్రహ జ్వాలాల్లో మోడీ ప్రభుత్వం కొట్టుకపోతుందని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ధర్నా నిర్వహించారు. అన్నదాతలు వేలాది ట్రాక్టర్‌లలో తరలి వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాల జిల్లా ఉమ్మడి నల్లగొండ భారత్ బంద్‌ను విజయవంతం చేసిందన్నారు. వ్యవసాయం నూతన చట్టాలతో నగరాలలో నివసించే మధ్యతరగతి ప్రజలు ఇబ్బందపడుతారన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో 24 గంటల విద్యుత్‌కు అంతరాయం కలగడంతో పాటు ఆహార కొరత ఏర్పడుతుందని జగదీష్ తెలియజేశారు. కొత్త వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా ఉన్నాయన్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు టిఆర్‌ఎస్ పోరాటం చేస్తుందన్నారు. కనీస మద్దతు ధర ఇవ్వాలన్న నిబంధన కూడా లేదని విమర్శించారు. ఎంత నిల్వ చేయాలని, పంటకు మద్దతు ధర ఎలా ప్రకటించాలని నిబంధన కూడా లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News