Tuesday, May 7, 2024

పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు : టిఎస్ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

High Court adjourned hearing on Dharani to May 10

హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని తెలిపింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై తెలంగాణ హైకోర్టు స్టేను ఈ నెల 10వరకు పొడిగించింది. ధరణి నిబంధనలకు సంబంధించిన 3 జివోలపై మధ్యంతర పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయవాది గోపాల్ శర్మ మధ్యంతర పటిషన్ల దాఖలు చేశారు. ధరణి జీవోలపై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని ఎజి కోరారు. ధరణిపై మధ్యంతర ఉత్తర్వుల వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని ఎజి కోర్టుకు వివరించారు. రిజిస్ట్రేషన్లు ఆపాలని ఆదేశించలేదని కోర్టు పేర్కొంది. పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు కొనసాగించుకోవచ్చని సూచించింది. ఇప్పటివరకు సేకరించిన డేటాకు చట్టబద్ధమైన భద్రత ఉండాల్సిందేనన్న హైకోర్టు ధరణిపై విచారణ డిసెంబర్ 10కి వాయిదా వేసింది.

High Court adjourned hearing on Dharani to May 10

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News