Thursday, May 2, 2024

చంద్రబాబు వెన్నుపోటు వీరుడు… పవన్ ప్యాకేజీ శూరుడు: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: హెరిటేజ్ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తన స్వార్థం కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని మండిపడ్డారు. చిత్తూరు డెయిరీ-అమూల్ డెయిరీకి సిఎం జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు.  మూతపడిన చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం కుట్ర పూరితంగా చిత్తూరు డెయిరీని మూసేశారని, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమూల్ డెయిరీతో రూ.385 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని, అమూల్ రాకతో రెండు లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయన్నారు. అమూల్ రాకతో ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని, అమూల్ రాకముందు లీటర్ గేదె పాలు ధర రూ.62 ఉంటే అమూల్ వచ్చాక లీటర్ గేదె పాటు ధర రూ.89.76 పైసలు అయ్యిందన్నారు.

Also Read: హనుమకొండలో విద్యార్థినిపై స్నేహితుడు అత్యాచారం…

నీతిమాలిన రాజకీయ నాయుడు చంద్రబాబు అని, వెల్లూరు మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకున్నది చంద్రబాబు, రామోజీనేనని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాకు మంచి చేశానని చెప్పుకోవడానికి చంద్రబాబు ఒక్కటీ లేదన్నారు. చంద్రగిరిలో గెలవలేనని  చంద్రబాబు కుప్పానికి వలస వెళ్లారని, అతి త్వరలో కుప్పం ప్రజలు కూడా చంద్రబాబుకు బైబై అంటారని, మళ్లీ కుప్పం ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ ఉన్నారని జగన్ ఎద్దేవా చేశారు. 75 ఏళ్ల ముసలాయన కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నానని డ్రామా చేస్తున్నారని, తన ముడుపుల కోసం ప్రభుత్వ సంస్థలను అమ్మేసే చరిత్ర చంద్రబాబుది అని దుయ్యబట్టారు.

తన వాళ్ల కోసం చంద్రబాబు 54 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని జగన్  మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పుడు సిఎంగా ఉంటే ఆర్‌టిసిని కూడా అమ్మేసేవాడన్నారు. కూతురు ఇచ్చిన మామకు బాబు వెన్నుపోటు పొడిచిన విషయం ఇప్పటి తరానికి తెలియదన్నారు. చంద్రబాబు వెన్నుపోటు వీరుడు… పవన్ ప్యాకేజీ శూరుడు అని జగన్ చురకలంటించారు. చంద్రబాబు, పవన్‌ను కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని, బాబు మోసాన్ని దత్తపుత్రుడు బలపరుస్తున్నారని, గతంలో రైతులను, అవ్వాతాతలను ఇద్దరు కలిసి వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News