Wednesday, May 8, 2024

మా పరిస్థితిని అర్థం చేసుకోండి

- Advertisement -
- Advertisement -

Jaishankar comments on India's oil purchase

రష్యా చమురుపై జైశంకర్ సమర్థన

బ్రటిస్లేవియా : రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై తలెత్తుతున్న విమర్శలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తిప్పికొట్టారు. ఉక్రెయిన్‌పై రెండు మూడు నెలలుగా రష్యా దాడులకు దిగుతోన్న దశలో ఆంక్షలకు బదులుగా రష్యా చమురు పొందడం సముచితం కాదని పలు దేశాలు విమర్శిస్తున్నాయి. అయితే ఇటువంటి వ్యాఖ్యలలో ఔచిత్యత లేదని విదేశాంగ మంత్రి తెలిపారు. స్లోవేకియాలో జరుగుతోన్న గ్లోబ్‌సెక్ 2022 బ్రెటిస్లేవా ఫోరం సదస్సులో భారత విదేశాంగ మంత్రి ప్రసంగించారు. రష్యా నుంచి ముడిచమురును పొందడాన్ని ఆయన సమర్థించారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉక్రెయిన్‌లో ఘర్షణ పరిస్థితిని ఎక్కువ కాలం తట్టుకోలేవని, ఈ విషయాన్ని అన్ని దేశాలూ సరిగ్గా గుర్తించాల్సి ఉందని ఎస్ జైశంకర్ తెలిపారు. రాళ్లు వేయడం కాదు. ముందు పరిస్థితిని అర్థం చేసుకుంటే ఎటువంటి మాటలకు అయినా దిగవచ్చునని తెలిపారు.

ఉక్రెయిన్ వార్ కొనసాగుతూ ఉన్నా ఇప్పటికీ యూరప్ దేశాలు రష్యా నుంచి చమురు తెప్పించుకుంటూనే ఉన్నాయని, అనవసరంగా భారత్‌ను నిందించడం కుదరదని స్పష్టం చేశారు. చమురు గ్యాస్‌లు విక్రయించడం ద్వారా వచ్చే నిధులను రష్యా ఉక్రెయిన్‌పై దాడి కొనసాగింపునకు వాడుతోందా అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఇది అనుచిత అంశం అన్నారు. దేశాలు తమ నిత్యావసరాల కోసం రష్యా నుంచి చమురు లేదా సహజవాయువులను పొందుతున్నాయని, ఇది అనివార్యం అని, యుద్ధం దశలో నిత్యావసర సరుకులు కొరత వచ్చేలా చేసుకునే పరిస్థితి రాకూడదని అన్ని దేశాలు ఇదే కోరుకుంటాయని, యూరప్ దేశాలు ఇప్పటికీ పైప్‌లైన్ల ద్వారా దండిగా రష్యా నుంచి గ్యాస్ పొందుతున్నాయి కదా అని ప్రశ్నించారు. ఆ దేశాలు సరఫరాలు పొందడం న్యాయం, ఇండియా తీసుకుంటే అన్యాయం అవుతుందా? అని ప్రశ్నించారు. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రష్యా ఏ క్రమంలో వాడుతున్నదనేది చెప్పడానికి భారతదేశానికి అయినా ఇతర దేశాలకు అయినా సరైన వివరణలు ఉంటాయా? అని ప్రశ్నించారు. రష్యా సరఫరాలపై ఇప్పుడు అమలులోకి వచ్చిన ఆంక్షలను ఆయన ప్రస్తావించారు. కొన్ని యూరప్ దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునే ఇటువంటి నిర్ణయానికి వచ్చారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News