Sunday, April 28, 2024

మదురైలో జల్లికట్టు స్టేడియం..

- Advertisement -
- Advertisement -

మదురై: తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి పేరిట నిర్మించిన జల్లికట్టు క్రీడా ప్రాంగణాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ బుధవారం ప్రారంభించారు. కరుణానిధి శతజయంతి ఉత్సవాలలో భాగంగా జల్లికట్టుకు పేరుపొందిన మదురై జిల్లాలోని అలంగనల్లూరులో గల కీలకరై గ్రామంలో 66.80 ఎకరాల విస్తీర్ణంలో రూ.62.78 కోట్ల వ్యయంతో నిర్మించిన సువిశాల జల్లికట్టు ప్రాంగణాన్ని స్టాలిన్ ప్రారంభించారు.

జల్లి కట్టు కోసం ప్రత్యేక భారీ ప్రాంగణాన్ని నిర్మిస్తామని స్టాలిన్ గతంలో అసెంబ్లీలో ప్రకటించారు. ఈ క్రీడా సముదాయంలో జల్లికట్టులో పాల్గొనే ఎద్దులను వదిలే ద్వారం, ఎద్దులను నిలిపి ఉంచే ప్రదేశం, పశు వైద్యశాల, ప్రాథమిక చికిత్సా కేంద్రం, మ్యూజియం వంటివి ఉన్నాయి. 5 వేల మంది ప్రేక్షకులు జల్లికట్టును వీక్షించేందుకు వీలుగా గ్యాలరీ కూడా ఉంది.

ఈ సందర్భంగా జల్లికట్టు విజేతలకు ముఖ్యమంత్రి స్టాలిన్ బంగారు ఉంగరాలను బహుకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమిళ ఐక్యతను నాశనం చేసేందుకు కుల, మతపరమైన విభేదాలను బిజెపి సృష్టిస్తోందని ఆరోపించారు. తమిళ ప్రజలు తమ సంస్కృతిని కాపాడుకుంటూ జల్లికట్టు ఉత్సవాన్ని సమైక్యంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. జల్లికట్టు నిర్వహణపై గత ఏడాది సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించడానికి ముందు వరకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వడంపై నాటకాలు వేసేదని ఆయన ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News