Sunday, May 5, 2024

ప్రజా సేవకే నా జీవితం అంకితం: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రజా సేవకే నా జీవితం అంకితం. సేవా లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా అనేక సేవలు చేస్తున్నానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో శాంతికృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో బుధవారం జరిగిన కార్యక్రమంలో 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ప్రజా నేతగా జనం గుండెల్లో నిలిచిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి జన బంధు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా అనేక సేవలు చేస్తున్నాను. వేలాది మందికి కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నానని గుర్తుచేశారు. సాగునీటి ద్వారా నియోజకవర్గాన్ని సస్య శ్యామలం చేశాను.

10 వేల మంది మహిళల అభివృద్ధి కోసం కుట్టు శిక్షణ, కుట్టుమిషన్లు ఉచితంగా అందజేశాను.వేలాది మంది యువతకు ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాను. 17 వేల మంది ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులను ఇప్పిస్తున్నాను. 70 వేల మంది ఉపాధి హామీ కూలీలకు ఉచితంగా లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్ అందజేశాను. లక్షలాదిమందికి వైద్య సేవలు అందించి ఆరోగ్యశ్రీకి స్ఫూర్తిగా నిలిచాను మంత్రి వెల్లడించారు. ప్రజల ఆశీస్సులతోనే నాకు జన బంధు అవార్డు ఇచ్చారని వెల్లడించారు. మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ లక్షణాలు ఇప్పటి వరకు నేను ఎవరిలో చూడలేదని ఆ లక్షణాలన్నీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి వున్నాయి అని అన్నారు. నిజమైన నాయకుడు గుండెతో ఆలోచించాలి అని అలాంటి లక్షణమే మంత్రి ఎర్రబెల్లి కి వుందన్నారు.

ఈ జనబంధు అవార్డుకు సరైన నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అని కొనియాడారు. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్, రామడుగు నరసింహశాస్త్రి, దైవజ్ఞశర్మ, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, వికలాంగుల సంస్థల రాష్ట్ర చైర్మన్ వాసుదేవరెడ్డి, చైర్మన్ సతీష్ రెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరి శంకర్, రైతు రుణమాఫీ చైర్మన్ నాగూర్ల వెంకన్న, ఎపి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, మాజీ జెడ్పీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, పాలకుర్తి దేవస్థానం చైర్మన్ రామచంద్రయ్య శర్మ, జెడ్పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటీసిలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News