Thursday, May 2, 2024

కరోనా వైరస్‌కు జపనీస్ డ్రగ్ విరుగుడు

- Advertisement -
- Advertisement -

 coronavirus

 

హైదరాబాద్ : జర్మన్ పరిశోధకులు కరోనా (కొవిడ్19) వైరస్‌ను నివారించగల సామర్థ్యం కలిగిన డ్రగ్‌ను రూపొందించ గలిగారు. జపనీస్ డ్రగ్ కెమొస్టాట్ మెసిలేట్ (వాణిజ్య నామం ‘ఫొయిపన్ ’) కరోనా వైరస్‌ను నయం చేయగలదని జర్మన్ వైరాలజీ బృందం స్పష్టం చేసింది. ఈమేరకు పరిశోధన వివరాలు సెల్ జర్నల్‌లో వెలువడ్డాయి. సార్స్‌కొవ్2 కరోనా వైరస్ మానవ కణాల్లో ఎలా ఆశ్రయం పొందుతుందో మొదట తెలుసుకున్నారు. కొత్త ఔషధాలను కనుగొనాలంటే చాలా కాలం పడుతుంది కాబట్టి ప్రస్తుతం ఎబోలా వైరస్ వంటి వాటి చికిత్స కోసం వినియోగిస్తున్న జపనీస్ డ్రగ్ కెమొస్టాల్ మెసిలేట్‌ను కరోనా వైరస్ చికిత్సకు వినియోగమయ్యేలా రూపొందించడమే మంచిదని వీరు ఈ పరిశోధన సాగించారు.

కొంతమంది రోగులపై దీన్ని పరీక్షించారు. నిర్దిష్టంగా కరోనా వైరస్‌కే ఇది ఉపయోగపడేది కాకున్నప్పటికీ దీన్ని కరోనా కు ఉపయోగపడేలా మార్పు చేయవచ్చని చెబుతున్నారు. సార్స్ కొవ్2 వంటి నలుసులు మానవ కణాల్లో ప్రవేశించకుండా మెసిలేట్ నివారించ గలుగుతుందని, పరిశోధకులు వివరించారు. జపాన్‌లో పాంక్రియాటిటిస్ వంటి మొండి వ్యాధులను నయం చేయడానికి మెసిలేట్‌ను వినియోగించడానికి ఔషధతయారీ సంస్థలు జపాన్‌లో అంగీకరించాయి. జంతువులపై వీటి ప్రయోగాలు చేశారు. ఇంకా మానవులపై ప్రయోగాలు చేయవలసి ఉంది.

Japanese drug antidote to coronavirus
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News