Saturday, April 27, 2024

చైనా నుంచే ఎందుకు కరోనా ప్రబలింది?

- Advertisement -
- Advertisement -

చైనాలోని వుహాన్ నుంచి కరోనా వైరస్ మొదట తలెత్తగానే చైనా ప్రభుత్వం 2019 డిసెంబర్ 31న ప్రపంచ ఆరోగ్య సంస్థను అప్రమత్తం చేసింది. అయితే దీని మూలాలు ఎక్కడ అని శోధించడం ప్రారంభించారు. వుహాన్ లోని జంతుమాంస మార్కెట్ నుంచే ఇది మొదట ప్రబలింది అని గ్రహించారు. ఇదివరకు అనేక వైరస్ వ్యాధులు అక్కడ నుంచే వ్యాపించాయి. ఇదే పోలిక గలిగిన వైరస్ 2003 లో చైనా లోని ఫోషన్ మార్కెట్ నుంచి వ్యాపించింది. ఇది సార్స్ వ్యాధిని కలగజేసింది. దాదాపు 12 దేశాల్లో ఈ సార్స్ వ్యాపించి 800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మార్చి 6 నాటికి కరోనా వైరస్ 83 దేశాలకు వ్యాపించి 3400 మందికి పైగా బలిగొంది. వీరిలో ఎక్కువ మంది చైనా దేశస్థులే. ఈ రెండు వైరస్‌ల పోలికలు ఇంచుమించూ ఒకేలా ఉండడం చర్చనీయాంశం అవుతున్నాయి.

Coronavirus Spread from Wuhan, China

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News