దుబాయ్: ఆసియాకప్-2025లో భారత్ ఫైనల్‌కి చేరువలో ఉంది. బుధవారం సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. ఇంకా సూపర్-4లో భారత్ రెండు మ్యాచ్‌లు ఆడాలి. ఇందులో ఒక మ్యాచ్‌లో విజయం సాధించినా.. భారత్ ఫైనల్‌కు చేరుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆడుతాడా..? లేదా..? అనే విషయంలో ఇప్పటికైతే క్లారిటీ లేదు. పని ఒత్తిడి వల్ల బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని సెలెక్టర్లు స్సష్టం చేశారు.
దీంతో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరిస్‌లో కూడా కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే బుమ్రా ఆడాడు. మిగితా రెండు మ్యాచులు విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు ఆసియాకప్‌లో గ్రూప్ దశలో అద్భుతమైన బౌలింగ్ చేసిన బుమ్రా (Jasprit Bumrah).. సూపర్-4లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయాడు. 4 ఓవర్లు వేసి 45 పరుగులు ఇచ్చాడు. దీంతో ఈ రోజు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో బుమ్రాకి విశ్రాంతి కల్పిస్తారని టాక్ వినిస్తోంది. మరి బుమ్రా స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారో తెలియాలి..
Also Read : ఇండియాఎతో రెండో టెస్టు.. ఆస్ట్రేలియాఎ 350/9