Saturday, April 27, 2024

జార్ఖండ్ రోప్ వే ట్రాలీల ఢీ: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Jharkhand Ropeway

 

రాంచీ: జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలోని తిర్కుట్ పహాడ్ ప్రాంతంలో సాంకేతిక లోపం కారణంగా రోప్‌వే ట్రాలీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. ఇద్దరు గాయపడ్డారు, 40 మంది వ్యక్తులు మధ్యలోనే చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. 10 రోప్‌వే ట్రాలీల్లో చిక్కుకున్న 40 మందిని రక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ ఆపరేషన్ చేపట్టింది.

డియోఘర్ డిప్యూటీ కమీషనర్ మంజునాథ్ భజంత్రీ మాట్లాడుతూ “ఈ సంఘటన ఫలితంగా ట్రాలీలలో ఒకదాని పుల్లీ ఇరుక్కుపోయింది. 40 మంది చిక్కుకుపోగా, వారిని రక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తోంది. వారికి సమాంతర రేఖ ద్వారా నీరు మరియు ఫలహారాలు అందించబడ్డాయి. ఎన్ డిఆర్ఎఫ్ వారిని రక్షించలేకపోతే, మేము రెస్క్యూ పని కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సహాయం తీసుకుంటాము’’ అన్నారు. రక్షించబడిన ముగ్గురిలో, తదుపరి చికిత్స కోసం రాంచీకి పంపబడగా మహిళ గాయాలతో మరణించిందని భజంత్రీ తెలిపారు.

డియోఘర్‌లోని త్రికుట్ హిల్స్ రోప్‌వే సర్వీస్‌లో చిక్కుకున్న సుమారు 40 మంది పర్యాటకులను రక్షించాలని ఏప్రిల్ 10న రాత్రి భారత వాయుసేనకి ఒక అభ్యర్థన అందింది. అభ్యర్థన మేరకు, భారత వాయు సేన ఏప్రిల్ 11 ఉదయం ఒక Mi-17, ఒక Mi-17 V 5 హెలికాప్టర్‌ను మోహరించింది. జిల్లా యంత్రాంగం మరియు NDRF సమన్వయంతో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News