Sunday, April 28, 2024

సోమవారం నుంచి విధుల్లోకి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  సోమవారం నుంచి జేపిఎస్‌లు (జూనియర్ పంచాయతీ కార్యదర్శులు) విధులకు హాజరుకానున్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ 16 రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెను శనివారం రాత్రి విరమించారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి చర్చలు జరిపిన జేపిఎస్ ప్రతినిధులు సోమవారం నుంచి విధులకు హాజరవుతామని తెలిపారు. ఉద్యోగ రెగ్యులరైజ్‌తో పాటు పలు డిమాండ్ల కోసం ఏప్రిల్ 28నుంచి సుమారు 16రోజులుగా తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేశారు.

శనివారం మధ్యాహ్నం 12గంటల్లోపు జేపిఎస్‌లు విధుల్లో చేరాలని లేకుంటే వారిని తక్షణమే ఉద్యోగం నుంచి తప్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంతో కొందరు శనివారం ఉదయం విధులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే జేపిఎస్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ ఇతర ప్రతినిధులు శనివారం రాత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో సుదీర్ఘంగా చర్చించారు. చర్చల్లో భాగంగా తాము యధాతథంగా విధులు నిర్వర్తిస్తామని, తమకు తగిన న్యాయం చేయాలని జేపిఎస్ ప్రతినిధులు మంత్రిని కోరారు. వారి సమస్యలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. దీంతో చర్చలు ఫలించడంతో వారు సోమవారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు.
సిఎస్ ఆదేశాలతో దిగొచ్చిన జేపిఎస్‌లు
మొదట తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని తమను బెదిరిస్తే సమ్మె మరింత ఉద్రిక్తం చేస్తామని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రకటించారు. ఈక్రమంలోనే ప్రభుత్వం వారికి నోటీసులను జారీ చేసింది. గత మంగళవారం నాటికి సమ్మె ముగించాలని లేకుంటే ఉద్యోగాలు నుంచి తీసేస్తామని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. అయినా లెక్క చేయని జేపిఎస్‌లు సమ్మె విషయంలో వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో మరోసారి శనివారం రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చి శనివారం మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చింది. దీంతో కొందరు విధుల్లో చేరగా, మరికొందరు సమ్మెలో ఉన్నారు. అనంతరం మంత్రితో జరిపిన చర్చలు ఫలించడంతో వారు సోమవారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News