Thursday, May 2, 2024

కాళేశ్వరం కయ్యం

- Advertisement -
- Advertisement -

నిబంధనలు మార్చి రుణమిచ్చింది మీరే

మనతెలంగాణ/హైదరాబాద్: వారం రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జ్యూడీషియల్ విచారణ వేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బిజెపి రా ష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్ర భుత్వంపై చేసిన ఆరోపణలను ఆయన తిప్పి కొట్టారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లా డుతూ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎవరు తప్పు చేసి నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.కాళేశ్వ రం ప్రాజెక్ట్ విషయం లో కేంద్ర నిబంధనలు మార్చి మరీ ఆ ప్రాజె క్ట్ కు రుణాలు ఇప్పించిందని ఆరోపించారు. కేం ద్రంలోని బిజెపి ప్రభుత్వమే కెసిఆర్ అవినీతికి మద్దతు ఇచ్చిందని తె లిపారు. రెండు పార్టీల మధ్య ఒప్పందం లే కుంటే, ప్రాజెక్ట్‌పై సమస్యలు బయటపడుతు న్నా కేంద్రం ఎందుకు స్పందించలేద ని ప్రశ్నించారు. కాళేశ్వ రం ప్రాజెక్ట్‌కు కేంద్ర ఆధీ నం లోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణం ఇచ్చిందని గుర్తు చేశా రు. ఏ రాష్ట్రంలో కూడా ఆ సంస్థ ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

విద్యుత్ రంగ ప్రాజెక్టులకు మాత్రమే రుణాలు ఇవ్వాల్సిన సంస్థ కాళేశ్వరానికి ఎందుకు రుణం ఇ చ్చిందని నిలదీశారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.లక్ష కోట్లు రుణాలు తీసుకున్నా మరీ కేంద్రం పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. కాళేశ్వరం రీడిజైన్లను, అదనపు అంచనాలను కేం ద్రం ఎందుకు అంగీకరించిందని ఉత్తమ్ ప్ర శ్నించారు. పదేళ్లుగా బిజెపి, బిఆర్‌ఎస్ క లిసే ఉన్నాయని ఆయన ఆరోపించారు. అందుకే ది ల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వ కుంట్ల కవిత ఎం దు కు అరెస్టు కాలేదన్నారు. బిఆర్‌ఎస్, బిజెపి వి ధానాల వల్ల తెలంగాణపై భారీగా అప్పుల భా రం పడిందని తెలిపారు. పది సంవ త్సరాల పాటు బిఆర్‌ఎస్, బిజెపిలు కలిసే పని చేశాయ ని ఆరోపించారు. కర్ణాటక, దిల్లీ, పంజాబ్‌లో సిబిఐ విచారణకు ప్రభుత్వాలకు అనుమతి తీసుకున్నారా అని బిజెపిని ప్రశ్నించారు. విపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాలపైకి సిబిఐ, ఇడిని పంపే కేంద్రం మాజీ సీఎం కెసిఆర్‌పై విచారణ ఎందుకు జరపలేదో చెప్పాలన్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత ఎందుకు అరెస్టు కాలేదని చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్, బిజెపి విధానాల వల్లే తెలంగాణపై భారీగా అప్పుల భారం పడిందని దుయ్యబట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News