Sunday, October 6, 2024

రేవంత్.. నువ్వు చంపుతానంటే.. నేను రెడీ: కౌశిక్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇష్యూలో పోలీసులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తన ఇంటి మీద దాడి చేయిస్తారా?.. మిమల్ని వదిలిపెట్టనంటూ పోలీసులపై కౌశిక్ రెడ్డి ఫైరయ్యారు. దగ్గరుండి తన మీద దాడి చేయించిన సీఐని, ఏసీపీని.. నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ మేము వచ్చిన తర్వాత మిమల్ని ఎట్టి పరిస్థితితో వదిలి పెట్టనని కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

కాగా, ఈ వివాదంపై సిఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ.. “సవాల్ ఎందుకు చేయాలి?.. వచ్చి వీపు చింతపండు చేస్తే.. దాడి చేస్తున్నారంటారు” అని కౌశిక్ రెడ్డి ఉద్దేశించి సెటైరికల్ కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన కౌశిక్ రెడ్డి.. “రేవంత్ రెడ్డి నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నా.. రేవంత్‌కు నేను భయపడను.. చావడానికైనా సిద్ధం.. దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తా”- అని కౌశిక్ రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News