Saturday, September 20, 2025

రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ తరతరాల ప్రతీకగా నిలిచిందని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తెలిపారు. ఆదివారం నుండి ప్రారంభమవుతున్న ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లో తెలంగాణ ప్రత్యేకతను చాటుతున్నదనీ అన్నారు. ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ, పల్లెలు పట్టణాల్లో.. మహిళలు పిల్లా పాపలతో ప్రత్యేక సాంస్కృతిక సందడి నెలకొంటుందని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల భాగస్వామ్యంతో, నాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలకు బతుకమ్మ ప్రధాన సాంస్కృతిక వేదికగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని, తెలంగాణ మహిళల ప్రత్యేక పండుగగా గుర్తించి కానుకగా బతుకమ్మ చీరలు అందజేసామని అన్నారు. కష్టాల నుంచి రక్షించి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రకృతి మాత బతుకమ్మను కెసిఆర్ ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News