Thursday, May 2, 2024

సిఎం కెసిఆర్‌కు హరితహారతులిచ్చి మొక్కలు తీర్చుకున్న రాష్ట్రం

- Advertisement -
- Advertisement -

KCR birthday

 

వాడవాడలా ఘనంగా జన్మదిన ఉత్సవాలు
విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా పాల్గొన్న అరుదైన సందర్భం
పొలాల్లో వేడుకలు జరుపుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రైతులు పొలం గట్ల వెంట మొక్కలు నాటిన వ్యవసాయదారులు
శాసనసభ ఆవరణలో, సిద్దిపేటలో, గుర్రంగూడ సంజీవని వనం అర్బన్ ఫారెస్టులో, పోలీసు కార్యాలయాల్లో ఇంకా పలుచోట్ల సాగిన ఆకుపచ్చయజ్ఞం

హైదరాబాద్ : ఉద్యమ నేత, టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 66వ జన్మదినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరిగాయి. సిఎం కెసిఆర్ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు, శాసనమండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్‌రె డ్డి దంపతులు,శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేము ల ప్రశాంత్ రెడ్డి, చీఫ్‌విప్‌లు ,శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు స్పీకర్ చాంబర్‌లో కేక్ కట్‌టేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు శాసనసభ ఆవరణలో 66 మొక్కలు నాటారు. అలాగే శాసనమండలిలో విధులు నిర్వహిస్తున్న 4వ తరగతి ఉద్యోగులకు ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి బట్టలపంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖమ్ంర తి హరీష్‌రావు సిద్ధిపేటలో లక్షా10వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పారంభించారు.

ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అకాంక్షిస్తూ ఆమేరకు అనేక పథకాలను అమలు చేస్తున్న సిఎం కెసిఆర్‌కు ప్రతిఒక్కరు మొక్క లు నాటి శుభాకాంక్షలు తెలపాలని పిలుపునిచ్చారు. అ లాగే సుడా కార్యాలయం ఆవరణలో హరీష్‌రావు మొక్క లు నాటారు. ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బి కార్యాలయం ఆవరణలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసనమండలి సభ్యుడు రాజేశ్వర్ రావుతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. లాంగ్ లీవ్ కెసిఆర్ అనే ప్రత్యేక టీషర్ట్ ధరించి ఎంఎల్‌ఏలు క్రాంతి, గాదరి కిషోర్,జీవన్‌రెడ్డి,సైదిరెడ్డి, హర్షవర్థన్‌రెడ్డి, ఎంఎల్‌సి కర్నెప్రభాకర్ మొక్కలు నాటి సిఎం కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పద్మావతి కాలనీలో సిసి రోడ్ ఇరువైపుల మంత్రి శ్రీనివాస్ గౌడ్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్‌కుమార్,ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ తో పాటు పలువురు ఐఏఎస్‌అధికారులు సంజీవయ్యపార్కులో మొక్కలునాటారు.

పొన్న,మోదుగ,నాగలింగం మోక్కలను సిఎస్ సోమేష్‌కుమార్ నాటారు. అలాగే గుర్రంగూడ సంజీవని వనం అర్బన్ ఫారెస్టు పార్కులో అటవీశాఖ ప్రధానకార్యదర్శి రాజేశ్వర్ తివారి అటవిశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్‌లో వేలాది మంది పాఠశాలల విద్యార్థులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెసిఆర్ పుట్టిన రోజు పండుగ నిర్వహించారు. ఖాళీస్థలాల్లో మొక్కలు నాటారు. టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో ప్రభుత్వవిప్ బాల్కసుమన్, ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన వికలాంగులకు వీల్ ఛైర్స్, అంధులకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం ఎంఎల్‌సి శ్రీనివాస్ రెడ్డి టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటారు. దేవుడు లాంటి సిఎం కెసిఆర్ సుధీర్ఘకాలం ప్రజాసేవలో నిమగ్నమై రాష్ట్రాన్ని మరింత అభివృద్ది చేయాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సహకార సంస్థ ఛైర్మన్ వాసుదేవారెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్రనాయకులు కేశవరావు, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేయడంతో పాటు ఆమె కోడలు సోనమ్ రాథోడ్‌తో కలిసి రక్తదానం చేశారు.

సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలు
సిఎం కెసిఆర్ 66వ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కళాకారులు సైంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ కార్యక్రమాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో గిరిజనుల కొమ్ము కోయ, గుస్సాడి నృత్యాలు, ఒగ్గుడోలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. మంత్రి జగదీష్‌రెడ్డి సూర్యాపేటలో నిర్వహించిన పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయనృత్యాలను సూర్యపేటలో ఏర్పాటు చేశారు. సుర్యాపేట సువెన్ ఫాక్టరీ దగ్గర సిఎం కెసిఆర్ జన్మదినోత్సవవేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సూర్యపేట టేకుమట్ల మూసి రహదారికి కెసిఆర్ రహదారిగా నామకరణం చేసినట్లు ప్రకటించారు. విద్యుత్‌రంగంలోని కార్మికులు, అధికారులు సిఎం పుట్టిన రోజు పండుగలో పాల్గొని మొక్కలునాటారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన నార్సింగ్ స్థలంలో విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అలాగే రాష్ట్ర మంత్రు,శాసనసభ్యులు, శాసనమండలిసభ్యులు, స్థానిక నాయకులు తాముప్రాతినిథ్యంవహించే నియోజకవర్గాల్లో సిఎం పుట్టినరోజుపండుగను ఘనంగా నిర్వహించారు. సేవాకార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు.

పంటపొలాల్లో పాలాభిషేకాలు
పంటపొలాల్లో రైతులు సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రైతులు తమపచ్చని పొలాల్లో జన్మదినవేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు బీళ్లుగా ఉన్న భూములు ప్రాజెక్టుల నిర్మాణాలతో పచ్చబడటంతో రైతులు ఆనందంగా కెసిఆర్ పుట్టిన రోజు పండుగను జరిపి పొలాల గట్లవెంట మొక్కలు నాటారు. కరీంనగర్,ఆదిలాబాద్ ఇచ్చోడ , గోదావరి పరివాహకప్రాంతాల్లోని పొలాల్లో పుట్టిన రోజుపండుగను జరిపారు .

మొక్కలు నాటిన పోలీసులు
రాష్ట్రంలోని పోలీసులు సిఎం బర్త్‌డే సందర్భంగా మొక్కలు నాటారు. డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశాలమేరకు పోలీసులు,పోలీసు అధికారులు తమ ఇళ్లముందు, ఖాలీస్థలాల్లో మొక్కలు నాటారు. డిజిపికార్యాలయంలోని ఖాళీ స్థలంలో మేహేందర్ రెడ్డి , అడిషనల్ డిజిపిలు సంతోష్ మెహరా,శివధర్ రెడ్డి,జితేందర్,గోవింద్ సింగ్,స్వాతీలక్రా, ఐజిలు బాలనాగాదేవి,సంజయ్‌కుమార్ జైన్‌తోపాటు పలువురు పోలిసు అధికారులు మొక్కలు నాటారు.

వేదపండితుల ఆశీర్వచనాలు
ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రగతిభవన్‌లో యాదాద్రి పండితులు వేదవచనాలతో ఆశీర్వదించారు. యాదాద్రి ఇఒ గీతారెడ్డి, ఆలేరు ఎంఎల్‌ఏ గొంగిడి సునీత తో కలిసి వచ్చిన యాదాద్రి పండితులు సిఎం కెసిఆర్‌ను,ఆయన సతీమణి శోభను వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులతో కొద్దిసేపు గడిపి అభిమానులను, ప్రజాప్రతినిధులను, అధికారులను కలిశారు. ఇదిలా ఉండగా సిఎం కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాలు యాదాద్రి, వేములవాడ, భద్రాచలంతో పాటు వివిధ ఆలయాల్లో టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు సిఎం గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించారు.

అనంతరం ఆలయ ప్రాంగణాల్లో గుడిపూజారులతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు మొక్కలను నాటారు. హైదరాబాద్‌లో పెద్దమ్మతల్లి, బల్కంపేట,మహాంకాళి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆంధ్రలో సిఎం కెసిఆర్ అభిమానులు దుర్గమ్మ ఆలయంలో పూజలు చేయించారు. విజయవాడలోని టిఆర్‌ఎస్ కార్యాలయంలో అక్కడి నాయకుడు ఆదినారాయణ కేక్‌కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు.

KCR birthday celebrations
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News