Monday, April 29, 2024

ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌సైన్సెస్ క్లస్టర్‌గా జీనోమ్ వ్యాలీ

- Advertisement -
- Advertisement -

Life Sciences

 

విస్తరణకు 2.0 మాస్టర్‌ప్లాన్ రెడీ

పరిశ్రమను 50 నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి కృషి
ఈ దశాబ్దంలో 4లక్షల ఉద్యోగాల కల్పన, రూ. 170 కోట్ల పెట్టుబడితో వస్తున్న సింజీన్ జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో 35% హైదరాబాద్ నుంచే
-17వ బయోఆసియా సదస్సు ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్

హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్‌గా జినోమ్ వ్యాలీని హైదరాబాద్‌లో విస్తరింపచేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఇందుకు అవసరమైన 2.0 మాస్టర్ ప్లాన్‌ను సిద్దం చేశామని ఆయన తెలిపారు. క్లస్టర్ చుట్టూ ఉన్న సామాజిక మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగంలో గణనీయమైన పురోభివృద్ధిని సాధిస్తోందన్నారు. జాతీయ ఫార్మా ఉత్పత్తికి 35శాతం హైదరాబాద్ నుంచే వస్తోందన్నారు. దాదాపు 800లకుపైగా ఫార్మా, బయోటెక్,మెడికల్ టె క్నాలజీ కంపెనీలతో తెలంగాణ ఇప్పటికే 50 బిలియన్ డాలర్ల ఎంటర్‌ప్రైజ్‌స్ విలువగా ఉందన్నారు. సోమవారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసిసిలో మూడు రోజుల పాటు జరగనున్న 17 వ బయో ఆసియా సదస్సును మంత్రి కెటిఆర్ అట్టహాసంగా ప్రారంభించారు.

టుడే ఫర్ టుమారో అనే నినాదంతో రేపటి తరాల కోసం ప్రపంచంలోని లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ ప్రస్తుత సామర్థ్యాన్ని పెంచుకొని, పెట్టుబడులు పెట్టడంతో పాటు అవసరమై న చర్యలను విధానాలను రూపకల్పన చేసేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లా డుతూ, ప్రస్తుతం ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రతి సంవత్సరం 2 బిఎన్ మోతాదుకుపైగా వ్యాక్సిన్లను తయారు చేస్తున్నామన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో 1/3 వ వంతుకు హైదరాబాద్ నగరం దోహదం చేస్తోందని తెలిపారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ 6 నెలల వయస్సు నుండి పిల్లల కోసం ప్రపంచంలో మొట్టమొదటి టైఫాయిడ్ కంజుగేట్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిందన్నారు. దీనిని గత సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఒ) ముందస్తుగా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు.

హైదరాబాద్‌లో మరిన్ని లైఫ్ సైన్సెస్ ఫార్మా పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. పరిశ్రమను 50 బిలియన్ డాలర్ల నుండి 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి చిత్త శుద్ధతో కృషి చేస్తామన్నారు. ఈ దశాబ్దంలో 4 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి యత్నిస్తామన్నారు. జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక సౌకర్యంతో సింజీన్‌ను రూ. 170 కోట్లతో హైదరాబాద్‌కు వస్తున్నందుకు ఆనందంగా ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో సింజీన్ ప్రవేశం గ్లోబల్ ఆర్‌అండ్‌డి హబ్‌గా హైదరాబాద్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు. వినూత్న, సరసమైన ఔషధ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి నగరం 1000 మందికి పైగా ప్రపం చ ఆవిష్కర్తలకు సేవలు అందిస్తున్నందుకు ఆనందంగా ఉందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. గ్రిడ్ వ్యూహంలో ఉన్న ఇతర కార్యక్రమాలలో ఒకటి మెడికల్ డివైసెస్ పార్క్ అని మంత్రి కెటిఆర్ తెలిపారు.

ఇది 276 ఎకరాలలో విస్తరించి ఉందన్నారు. దేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల పార్కుగా ఆయన అభివర్ణించారు. 2 సంవత్సరాల వ్యవధిలో 20కి పైగా కంపెనీలు ఇప్పటికే తమ తయారీతో పాటు ఆర్ అండ్ డి యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. వాటిల్లో పలు సంస్థలు తమ వాణిజ్య ఉత్పత్తిని పార్కులో ప్రారంభించబోతున్నారని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఆసియాలో అతిపెద్ద స్టెంట్ తయారీ సదుపాయాన్ని ఏర్పాటు చేసే ప్రాంతంగా హైదరాబాద్‌ను సహజనంద్ మెడికల్ టెక్నాలజీస్ ఎంచుకున్నదన్నారు. అలాగే మెడ్‌ట్రానిక్ వంటి సంస్థలకు, నూతన ఆవిష్కరణలు, అభివృద్ధి, ఇంజనీరింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి హైదరాబాద్ ఒక ముఖ్యమైన కేంద్రంగా పనిచేస్తుందన్నారు.

వైద్య పరికరాల రంగానికి రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఈ నెల 19న బయోఆసియా కార్యక్రమంలో భాగంగా మేము వైద్య పరికరాలు,హెల్త్‌టెక్‌పై మరింత దృష్టి సారించామన్నారు. గత సంవత్సరం బయో ఆసియా సదస్సులో ఖచ్చితంగా తాము చెప్పినట్లుగానే డిజిటల్ యొక్క ప్రధాన స్రవంతి ద్వారా వ్యాపార నమూనాలు కూడా మారుతున్నాయన్నారు. ఫార్మా సిటీ ద్వారా రేపటి సమస్యలకు సరసమైన మరియు వినూత్న పరిష్కారాలను ప్రోత్సహిస్తామని కెటిఆర్ అన్నారు.

Telangana is fast progressing in Life Sciences field
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News