Monday, May 6, 2024

కెసిఆర్ శాంతియుత పోరాటం చేసి స్వరాష్ట్రం సాధించారు

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి ప్రతినిధి : అహింస విధానంలో మలి విడత తెలంగాణ ఉద్యమ నేత కెసిఆర్ శాంతియుతంగా పోరాటం చేసి స్వరాష్ట్రం సాధించారని ప్రభుత్వ విప్ గంపగోవర్దన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో గురువారం జెడ్పి సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమరవీరుల ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. అమరవీల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధ్దించిందని చెప్పారు. ప్రతి ఒక్కరు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని పేర్కొన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత అభివృద్ధ్ది, సంక్షేమ రంగాలలో దేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.

2014 జూన్ కన్న ముందు రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తి అయిన తరువాత పదవ సంవత్సరంలోని అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధ్ది పనులను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారని చెప్పారు. జిల్లాలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో అధికారులు ప్రజా పతినిధులు వేడుకలు ఏర్పాటు చేసి సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారని పేర్కొన్నారు. జిల్లాలో దశాబ్ది వేడుకలకు ప్రజల నుంచి అపూర్వస్పందన లభించిందని తెలిపారు. ఉద్యమ నాయకుడు కెసిఆర్ స్వరాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి రావడం గొప్ప విషయమని కొనియాడారు. జెడ్పి చైర్‌పర్సన్ శోభ మాట్లాడారు.

దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు ధన్యవాదములు తెలిపారు. ప్రభుత్వం పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పారు. అమరవీరుల త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ్దమైన తెలంగాణ రాష్ట్ర సాధన, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం, అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమంలో ప్రజల ధైర్య సాహసాలు ప్రదర్శించారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు ధన్యవాదములు తెలిపారు. అమరవీరుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించి అమరవీరుల సంస్మరణ దినోత్సవంప ఏర్పాటు చేసిందని చెప్పారు.

ఈ సందర్భంగా జెడ్పి సర్వసభ్య సమావేశంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. వారికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరవీరుల సంస్మరణ తీర్మాణానికి జెడ్పి చైర్‌పర్సన్ శోభ సభ్యులకు తెలియజేశారు. 17 అమరవీరుల కుటుంబాలకు ఈ సందర్భంగా జ్ఞాపికలు అందజేసి శాలువాలతో సన్మానించారు. సమావేశంలో జెడ్పి వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పి సీఈవో సాయాగౌడ్, జడ్పిటిసీ సభ్యులు, ఎంపిపిలు, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News