Wednesday, May 15, 2024

పశువుల పాకగా రాందాస్‌తండా పాఠశాల

- Advertisement -
  • గిరిజన తండాపై ప్రభుత్వం చిన్నచూపు
  • దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నా పాఠశాలపై కనిపించని విద్యాశాఖ శ్రద్ధ
    నాంపల్లి : ఉమ్మడి ఆంధ్రపదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న రాందాస్ తండాలోని ఏకైక ప్రభుత్వ పాఠశాల మూతపడింది. మూతపడి సంవత్సరాలు గడుస్తునా ప్రభుత్వం పాఠశాల తెరవడానికి ఎలాంటి ప్రయత్నాలుచేయడం లేదు. దీంతో ఆ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఉన్న వందలమంది విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో మండల కేంద్రమైన నాంపల్లి, చండూరు ప్రాంతాలకు వ్యయ ప్రయాసలతో వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రామ్‌దాస్‌తండా గ్రామ పంచాయతిలో ఉన్న పాఠశాల గదులు పశువుల కొట్టంగా మారాయి.
  • వంటశాల సైతం పశువులకు ఆవాసంగా మారింది. ఉపాధ్యాయులు సరైన రవాణా సౌకర్యం లేదనే నెపంతో బదిలీలు చేయించుకోవడంతో పాఠశాలకు ఉపాధ్యాయులు రావడానికి ఆసక్తి చూపకపోవడంతో పిల్లలు ఉన్నా ఉపాధ్యాయులు లేక విద్యార్థులను తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల బాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేకపోవడం ,ఉపాధ్యాయుల కొరత,తరగతి గదుల నిర్మాణం సరిగ్గా లేక, ప్రహరీగోడ లేకపోవడం తదితర మౌలిక సదుపాయాలు కల్పి ంచడంతో జిల్లా విద్యాశాఖ విఫలం చెందారు.
  • ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను రప్పించాలని ప్రజాప్రతినిధులు ఎన్ని ప్రయత్నాలుచేసినా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9వసంతాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలోకి ప్రవేశిస్తుండగా దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటూ విద్యాదినోత్సవాన్ని సైతం జరు పుకుంటున్నా ,రాందాస్‌తండాలోని పాఠశాలలో నెలకొన్న సమస్యలు మాత్రం పట్టిం చుకోడంలేదు.పాఠశాల భవనం పశువుల కొట్టంగా మారినా అధికార యంత్రాంగం మాత్రం ఉత్సవాలు జరుపుకోవడంలో మునిగిపోయి పాఠశాల దుస్థితిని, గిరిజనాభివృద్ధ్దిని పట్టించు కోవడంలే దని తండావాసులు , గ్రామస్తులు అంటున్నారు.
  • ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం , విద్యాశాఖ అధికారులు రాందాస్ తండా గ్రామపంచాయతీపై దృష్టి సారించి పాఠశాలకు అ వసరమైన అన్ని రకాల వసతులు కల్పించి ,పాఠశాలను పునరుద్దరించాలని , పేద మద్యతరగతి విద్యార్థులు చదువుకు దూరంకాకుండా చూడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. రాందాస్ తండా ప్రత్యేక గ్రామపంచాయతీగా కొనసాగుతున్నప్పటికీ తమ గ్రామంలో ప్రభుత్వ పాఠాశాల లేకపోవడంపై గ్రామ సర్పంచ్ మేఘావత్తు నీలా రవినాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించడానికి ముందుకు వస్తే తగిన తోడ్పాటు అందిచండానికి గ్రామస్తులంతా సహకరించడానికి సిద్ధ్దంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలిమరీ.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News