Sunday, April 28, 2024

కెసిఆర్ అంటే నమ్మకం…మోడీ అంటే అమ్మకం

- Advertisement -
- Advertisement -

నమో అంటే నమ్మించి మోసం చేయడమే

ప్రధాని మోడీపై మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు ఎదురుదాడి

మన తెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్ అంటే నమ్మకం.. మోడీ అంటే అమ్మకం అనే పరిస్థితి ఉందని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి ఆర్ పేర్కొన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మకానికి పె ట్టిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఏ ము ఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చాడో చెప్పాలని ప్రశ్నించారు. కార్పొరేట్ కంపెనీలకు వంత పాడుతున్న ప్రధా ని.. ప్రభుత్వ సంస్థలను తన దోస్తులకు అగ్గువకే కట్టబెడుతూ చందాలు తీసు కుంటున్నారని ఆరోపించారు. పెద్దప ల్లి జిల్లాకు రామగుండంలో సింగరేణి భూనిర్వాసితులకు పరిహార పంపిణీ, దళితబంధు, గృహలక్ష్మి లబ్ధిదారుల కు కెటిఆర్ ప్రభుత్వ ఉత్తర్వులను అం దజేశారు. సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, సింగరేణిని అమ్మబోమని తెలంగాణలో హామీ ఇచ్చిన మోడీ, ఢిల్లీకి వెళ్లగానే సంస్థ నాలుగు గనులను వేలానికి పెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేలం పాటలో పాల్గొనమని ఉచిత సలహా ఇచ్చారని ఎద్దేవా చేశారు. గుజరాత్ మినరల్స్ తరహాలో సింగరేణికి కూడా మైన్స్ కేటాయించమని కోరితే.. మోడీ మొండి చేయి చూపించారని కెటిఆర్ పేర్కొన్నారు. గుజరాత్‌కు ఒక న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.

గత ప్రభుత్వాల పాలనలో సింగరేణి కార్మికులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని.. సంస్థ లాభాల్లో వాటా కింద కేవలం 18 శాతం మాత్రమే ఇచ్చేవారని పేర్కొన్నారు. నేడు బిఆర్‌ఎస్ హయాంలో.. సింగరేణి లాభాల్లో కార్మికులకు 42శాతం వాటా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలు పరిష్కరించినట్లు గుర్తు చేశారు.
తెలంగాణపై మోడీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి : కెటిఆర్
తెలంగాణపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కెటిఆర్ మాట్లాడుతూ.. ప్రధానికి స్పీచ్ ఎవరు రాస్తున్నారో తెలియదు… రుణమాఫీ పేరుతో కెసిఆర్ మోసం అంటూ మాటలు మాట్లాడుతున్నారని, కెసిఆర్‌పై చేసిన వ్యాఖ్యలను మోడీ ఉపసంహరించుకోవాలని అన్నారు. తెలంగాణలో 70 లక్షల మంది రైతులకు రూ.72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిన విషయం తెలుసుకుంటే మంచిది ప్రధానికి సూచించారు. తెలంగాణ ప్రజలకు కెసిఆర్ కుటుంబ సభ్యుడే అని పేర్కొన్నారు.
దేశ ప్రజలే జాతీయస్థాయిలో అధికార మార్పు కోరుకుంటున్నారు…
మార్పును కోరుకుంటుందని తెలంగాణ ప్రజలు కాదని.. జాతీయ స్థాయిలో అధికార మార్పులు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి కెటిఆర్ అన్నారు. మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పందించారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమని తెలంగాణ ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ స్టీరింగ్ కెసిఆర్ చేతుల్లో పదిలంగానే ఉందని.. కానీ బిజెపి స్టీరింగ్ అదాని చేతిలోకి వెళ్లిపోయిందంటూ సెటైర్లు వేశారు. కేంద్రం కిసాన్ సమ్మాన్ కింద ఇచ్చింది కేవలం నామమాత్రం కానీ.. ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ 70 లక్షల మంది రైతులకు 72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిన విషయం తెలుసుకుంటే మంచిదని మోడీకి సూచించారు.
రుణమాఫీ జరగలేదని మాట్లాడటం.. మిలియన్ డాలర్ జోక్…
రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం.. మిలియన్ డాలర్ జోక్ అని కెటిఆర్ అన్నారు. స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక కొత్త రాష్ట్రం రెండుసార్లు రైతుల రుణమాఫీకి నడుం బిగించిన ఏకైక సందర్భమని.. అది తెలంగాణలోనే ఆవిష్కృతమైందని తెలిపారు. అన్నదాత అప్పులు మాఫీ చేసిన జైకిసాన్ ప్రభుత్వం మాదని.. కార్పొరేట్ దోస్తులకు 14.5 లక్షల కోట్ల రుణాలు రద్దు చేసిన నై కిసాన్ సర్కారు మీది అంటూ విమర్శించారు. కర్షకుల రక్తం కండ్ల జూసిన రైతుహంతక రాజ్యం బిజెపిది అని, పదేళ్లపాటు విభజన హామీలను పాతరేసి.. ఎన్నికల హామీలను గాలికి వదిలేసి ఓట్ల వేటలో ఇప్పుడొచ్చి మాట్లాడితే నమ్మేదేవరని చురకలంటించారు. ప్రాజెక్టులతో చుక్క నీరు రాలేదనడం మోదీ అవివేకానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో సాగునీటి విప్లవం సాగుతుందని, తెలంగాణ రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన మీరా మాట్లాడేది..? అంటూ మోడీని నిలదీశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనమంటే నూకలు తినమన్న కేంద్ర పెద్దల అవమానకర మాటలు తెలంగాణ రైతులు మరిచిపోలేదని పేర్కొన్నారు. మోడీ ఎన్ని మాటలు చెప్పినా.. బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని చెప్పారు. నిన్న కాళేశ్వరం అయినా.. నేడు పాలమూరు ప్రాజెక్టు అయినా.. ప్రపంచ సాగునీటి చరిత్రలోనే అతి గొప్ప మానవ నిర్మిత అద్భుతాలని వ్యాఖ్యానించారు.
గిరిజన యూనివర్సిటీ విభజన చట్టంలోనే ఉంది : మంత్రి హరీశ్
గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేయలేదని రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పాలమూరు నుంచి తెలంగాణకు రావాల్సిన నీటిని కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపనలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందని, ఇప్పుడు మోదీ వచ్చి గిరిజన యూనివర్సిటీ ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తొమ్మిదేళ్లుగా గిరిజన యూనివర్సిటీ రాకుండా అడ్డం పడ్డది బిజెపి ప్రభుత్వం అని, ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ అంటూ మోడీ చెవుల్లో పువ్వులు పెడుతున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రధానిని నిలదీశారు. బిజెపి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని, ఎన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News