Sunday, April 28, 2024

గజ్వేల్‌లో ఇంకా అభివృద్ధి జరగాలి: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి చాలా జరిగిందని, ఇంకా కావాల్సింది చాలా ఉందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. లీడర్లు.. జరిగిన అభివృద్ధి చాలు అని ఉరుకోవద్దని, ఇంకా తమ కృషి కొనసాగించాలని స్పష్టం చేశారు.శుక్రవారం శామీర్‌పేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ గజ్వెల్ కార్యకర్తల ప్రత్యేక సమావేశానికి కెసిఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, మాజీ స్పీకర్ మదుసూదనా చారి, బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… తాను సిద్దిపేట ఎంఎల్‌ఎగా ఉన్నప్పుడు సిద్దిపేటలో భయంకరమైన కరువు ఉండేదని, అప్పుడు ఆలోచన చేసి మిడ్ మానేరు నుండి ఎత్తయిన గుట్టపైకి నీళ్లు సప్లై చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చామని అన్నారు. ఇదే స్ఫూర్తిగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఆనాడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఖాళీ బిందెలతో ప్రదర్శనలు ఉండేదని, ఇప్పుడు ఎక్కడా అలాంటి పరిస్థితి లేదని సిఎం స్పష్టం చేవారు.

తెలంగాణ వచ్చిన రోజున బతుకు దెరువు కోసం వలసలు వెళ్లి… చెట్టుకొక్కరు గుట్టకు ఒక్కరు అయ్యామని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌తోపాటు మెదక్ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ నేడు వలసలు మాయమై మన రాష్ట్రానికే వలసలు వచ్చే పరిస్థితి వచ్చిందని సిఎం అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ ద్వారా ఇది సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అద్భుతంగా పురోగమించిందని పేర్కొన్నారు. ఎంతో మంది ఆర్థిక, వ్యవసాయ రంగం నిపుణులతో మాట్లాడి అనేక సంస్కరణలు చేపట్టి పథకాలు అందుబాటులోకి తేవడంతో వ్యవసాయ స్థిరీకరణ జరిగిందని వెల్లడించారు. అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సిఎం సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News