Tuesday, April 30, 2024

రాష్ట్రంలోనూ ఆయుష్మాన్ భారత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఇక నుంచి తెలంగాణలోనూ ఆయూష్మాన్ ఫథకం అమలు కానుంది. దీంతో ఆరోగ్యశ్రీలో లేని 685 చికిత్సను కొత్తగా కలువనున్నాయి.ఈ రెండు స్కీంలు కలయికలతో దేశంలో ఎక్కడైనా చికిత్స చేయించుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు అంటున్నారు. అంతేగాక ప్రజలకు డబుల్ బెన్‌ఫిట్‌తో పాటు రాష్ట్రానికి సుమారు రూ.200 కోట్ల వరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పారు. వాస్తవంగా ఆరోగ్యశ్రీకి, ఆయుష్మాన్ భారత్‌కు తేడాలు ఉన్నప్పటికీ, ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో పేదలకు ఉచితంగా చికిత్సను అందించడమే రెండింటి ప్రధాన ఉద్దేశం ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తే, ఆయుష్మాన్‌లో కలిస్తే రూ.5 లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు అప్ ది రికార్డులో తెలిపారు. అంతేగాక ఆరోగ్యశ్రీలో 972 రకాల ట్రీట్‌మెంట్ ప్రొసీజర్స్ కవర్ అవుతుండగా, ఆయుష్మాన్‌లో 1,350 చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆయుష్మాన్‌లో లేని 540 ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీలో ఉండగా, ఆరోగ్యశ్రీలో లేని 685 ప్రొసీజర్స్ ఆయుష్మాన్‌లో ఉన్నాయి. దీంతో ఈ రెండింటిని ఇంజెక్ట్(కలుపడం) ప్రజలకు మేలని సిఎం కెసిఆర్ ఆలోచించినట్లు అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు డెంగీ, మలేరియా వంటి వాటికి ఆరోగ్యశ్రీ వర్తించదు..కానీ ఆయుష్మాన్ వర్తిస్తుంది. కిడ్నీ, లివర్ మార్పిడులు ఆరోగ్యశ్రీలో ఉండగా, ఆయుష్మాన్‌లో లేవు. ఈ రెండింటిని కలిపితే అన్ని చికిత్సలు ఒకే గొడుగు కిందకి వస్తాయి. మొత్తానికి రెండింటినీ కలిపి అమలు చేస్తే రాష్ట్ర ప్రజలకు 1,887 రకాల చికిత్సలకు ఉచిత వైద్యం లభిస్తుందని అధికారులు అంటున్నారు.
26.11 లక్షల కుటుంబాలకు మేలు..
తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తుండగా, సోషియో ఎకనామిక్ కాస్ట్ లెక్కల ప్రకారం ఆయుష్మాన్ లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇందులో రాష్ట్రంలోని 26.11 లక్షల కుటుంబాలు కవర్ అవుతున్నాయి. కానీ ఇది ఆరోగ్యశ్రీ కంటే చాలా తక్కువ. ఆరోగ్యశ్రీలో 77.19 లక్షల కుటుంబాలకు వర్తిస్తాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా సగటున రూ.700 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఆయుష్మాన్ అమలు చేస్తే 26.11 లక్షల కుటుంబాల కోసం సుమారు రూ.200 కోట్ల వరకూ కేంద్రమే భరిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం తగ్గుతుంది. అంతేకాకుండా ఈ 26.11 లక్షల కుటుంబాలు దేశంలో ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలంగాణ వాళ్లకు, తెలంగాణలో ఉంటున్న ఇతర రాష్ట్రాల వాళ్లకూ దీని వలన మేలు జరుగుతుంది.

KCR Orders to implement Ayushman Bharat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News