Friday, May 3, 2024

తెలంగాణలో కరోనా లేదు, రానివ్వం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్‌ లేదని, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి మాత్రమే కరోనా సోకిందని.. అంతేకానీ, రాష్ట్రానికి కరోనా వచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్పష్టం చేశారు. శనివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడారు. ”కరోనా వైరస్‌ ఇక్కడ పుట్టినది కాదు. కరోనాపై అసత్యాలు, దుష్ప్రచారాలు చేయడం సరికాదు. రాష్ర్టానికి కరోనా వైరస్‌ రాదు.. ఒక వేళ వచ్చినా రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అయినా కరోనాను అడ్డుకుంటాం. 130 కోట్ల మంది ఉన్న దేశంలో 31 మందికే కరోనా వచ్చింది. 22 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కరోనా వైరస్‌ బతకదు. మన దగ్గర 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అలాంటప్పుడు ఆ వైరస్‌ ఎలా బతుకుతుంది. లేని కరోనా కోసం ఎందుకు మాస్కులు పెట్టుకోవాలి. కరోనాపై జరిగే ప్రచారం బక్వాస్ అని, పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని ఒక సైంటిస్ట్ నాతో చెప్పాడు. మన రాష్ట్రంలో మాస్క్‌ పెట్టుకోకుండానే కరోనాపై యుద్ధం చేస్తాం. ఇక, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకంతో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌కు అడ్డుకట్ట వేశాం. మిషన్‌ భగీరథ అద్భుత పథకమని కేంద్రం ప్రసంశించింది. ఈ పథకం కోసం ఇప్పటికే రూ. 41 వేల కోట్లు ఖర్చు చేశాం. మరో రూ.3వేల కోట్లకు టెండర్లు పిలుస్తాం. మిషన్‌ భగీరథ పథకాన్ని పలు రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకున్నాయి” అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

 KCR thanks speech over Governor addressed at Assembly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News