Sunday, May 5, 2024

మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా కెసిఆర్ దూరం!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించనున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దూరంగా ఉండనున్నారని సమాచారం. ఆయన బేగంపేట్ విమానాశ్రయం చేరుకోనున్నప్పుడు కూడా ఆయనను రిసీవ్ చేసుకోడానికి కూడా వెళ్లరని ఎఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. మోడీ తెలంగాణలో రూ. 11360 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వస్తున్నారు. ఆ తర్వాత మోడీ తమిళనాడుకు వెళ్లి చెన్నై ఎయిర్‌పోర్ట్ టర్మినల్‌ను ప్రారంభించనున్నారని సమాచారం.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరుగనున్నాయి. తెలంగాణలో అధికారం చేజిక్కించుకోడానికి బిజెపి ప్రయత్నించనున్నది. కెసిఆర్ భారత రాష్ట్ర సమితి(ఇదివరకటి టిఆర్‌ఎస్) పార్టీని దెబ్బతీయడానికి చేయగలిగిందంతా చేయనున్నది. కెసిఆర్ తన పార్టీకి కొత్త పేరును 2022 అక్టోబర్‌లో పెట్టారు. ఆయన జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించేందుకు ఇలా చేశారని అనుకుంటున్నారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎను ఎదుర్కొనబోతున్నాయి.

మోడీ నేడు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు సికింద్రాబాద్‌లో 11.45 గంటలకు జెండా ఊపనున్నారు. అలాగే బీబీనగర్‌లోని ఎఐఐఎంఎస్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాక ఐదు హైవే ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News