Saturday, May 4, 2024

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏరియా అధికార ప్రతినిధి అజ్మీర తుకారాం అన్నారు. భూపాలపల్లి ఏరియాలోని ఆసుపత్రి ఆవరణలో స్వచ్ఛతా పక్వాడాలో భాగంగా పరిసరాలను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా అధి కార ప్రతినిధి అజ్మీర తుకారాం ముఖ్య అతిథిగా హాజర య్యారు.

ఈ సందర్భంగా డిజిఎం(పర్సనల్) మాట్లాడుతూ స్వచ్ఛత పఖ్వాడ 2023 ఒక గొప్ప కార్యక్రమం అని స్వచ్ఛమైన భారతదేశం నిర్మాణంలో స్వచ్ఛతా పక్షోత్సవాలు ముఖ్య భూమికను పోషిస్తుందని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా వైద్యులు, అధికారులకు, ఆసుపత్రి సిబ్బంది కలిసి పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ గృహాలను ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులు వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎంఓ డాక్టర్ ఎస్ పద్మజ డాక్టర్ గోపి, ఎన్విరాన్‌మెంట్ అధికారి బి క్రిష్ణ ప్రసాద్, బి శ్యామ్ ప్రసాద్, ఏరియా ఆసుపత్రి వైద్యులు, స్టాఫ్ నర్స్‌లు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News