Sunday, April 28, 2024

కాపులు చైతన్యవంతులు కావాలి

- Advertisement -
- Advertisement -
  • రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కోవ లక్ష్మణ్

కీసర: మున్నూరు కాపులు చైతన్యవంతులు కావాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, డా. కోవ లక్ష్మణ్, జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వీరమళ్లు ప్రకాష్ అన్నారు. ఆదివారం నాగారంలో మున్నూరు కాపు, కాపు విద్యావంతుల సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, డా. కోవ లక్ష్మణ్, జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమళ్లు ప్రకాష్ జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘటితంగా ముందుకు సాగితే హక్కులను సాధించుకోవచ్చని అన్నారు. కాపు విద్యావంతులు వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణించి రాజ్యాధికారం సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. మున్నూరు కాపులు, కాపులు ఎన్నికల బరిలో నిలిచిన చోట రాజకీయాలను పక్కన పెట్టి సంఘటితంగా తమ జాతి బిడ్డలను చట్ట సభలకు పంపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, తెలంగాణ మహిళ అభివృద్ది సంస్థ ఛైర్మన్ ఆకుల లలిత, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రాంమోహన్, మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు గోపాలకృష్ణ, కుమార్, వేణు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News