Sunday, April 28, 2024

యుఎస్‌లో కేరళ నర్సును చంపిన భర్తకు జీవితఖైదు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో భార్యను భర్త చంపిన కేసులో నిందితుడికి కోర్టు జీవితఖైదు విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కేరళకు చెందిన ఫిలిప్ మాథ్యూ(34) తన భార్య మెరిన్ జాయ్(27)తో కలిసి అమెరికాలో ఉంటున్నాడు. ఫ్లోరిడాలోని కోరల్ స్ప్రింగ్స్‌లోని బ్రోవార్డ్ హెల్త్ ఆస్పత్రిలో జాయ్ నర్సుగా పని చేస్తుంది. గత కొన్ని రోజుల నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో 2020 జులై 28వ తేదీన తన ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు పార్కింగ్ లో ఉన్న కారు వద్దకు వెళ్లింది. అక్కడ కాపుకాచిన భర్త ఆమెపై కత్తితో దాడి చేసి చంపేశాడు. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆస్పత్రి పార్కింగ్ స్థలంలో మర్డర్ జరగడంతో వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడికి ఆమెరికా న్యాయస్థానంలో పెరోల్ లేకుండా జీవితఖైదు విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News