- Advertisement -
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిన ‘కెజిఎఫ్’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసింది. ఈ సినిమాతో యశ్ పేరు ఇండియాలో మారుమోగింది. దీంతో ‘కెజిఎఫ్2’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకుతగ్గట్టుగానే ఈ సినిమాలో అగ్ర నటీనటులతో కీలక పాత్రలు చేయించారు చిత్రయూనిట్. శుక్రవారం హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపటి క్రిత్రం ఈ మూవీ టీజర్ ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. హై హోల్టేజ్ తో రూపొందించిన ఈ టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.
KGF 2 Movie Teaser Released
- Advertisement -