Sunday, April 28, 2024

హోంగార్డు వ్యవస్థలో శ్రమ దోపిడి జరుగుతోంది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో హోంగార్డు వ్యవస్థలో శ్రమ దోపిడి జరుగుతోందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. డిఆర్ డివో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ ను గురువారం కిషన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ..”హోంగార్డు రవీందర్ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురుదృష్టకరం. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. హోంగార్డు కుటుంబ సభ్యులు జీతాలు లేక రోడ్డున పడుతున్నారు. హోంగార్డులు 16 గంటలు పనిచేస్తున్నారు. హోంగార్డు వ్యవస్థలో శ్రమ దోపిడి జరుగుతోంది.

హోంగార్డులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. హోంగార్డులను రెగ్యులర్ చేస్తామని కెసిఆర్ శాసన సభలో హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగస్థులతో సమానంగా హోంగార్డులను గుర్తించాలి. ప్రత్యేక బందోబస్తు సమయాల్లో హోంగార్డులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలి. ప్రతికూల పరిస్థితుల్లో హోంగార్డులు పనిచేస్తున్నారు. హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తోంది. పోలీస్ వ్యవస్థలో సైతం హోంగార్డులకు అవమానం జరుగుతోంది” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News