Tuesday, April 30, 2024

కాంగ్రెస్ హామీలకు కార్యాచరణ ఏదీ?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గజదొంగలు పోయి ఘరానా దొంగలు వచ్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్య మా..? అని ప్రశ్నించారు. రైతుల కష్టాలు తీరుస్తామని, అనేక రకాల ఆశలు రైతు సమాజంలో రేకెత్తించి. గ్యారంటీల పేరుతో మభ్యపెట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయడాన్ని నిరసిస్తూ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందరోజు ల్లోనే ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవం త్‌రెడ్డి వంటివారు అనేక ప్రాంతాల్లో చెప్పారు కాని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తూర్పారబట్టారు.

కాంగ్రెస్ గ్యారంటీ అంటే ప్రజలను మభ్య పెట్టే, మోసం చేసే గ్యారంటీ, రైతులకు వెన్నుపోటు పొడిచే, దగా చేసే గ్యారంటీ అని అభివర్ణించారు. సోనియమ్మ పాలన రాగానే డిసెంబరు 9న తక్షణమే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు కాని ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని విమర్శిం చారు. ఏ ఒక్కరు కూడా బ్యాంకులకు అప్పులు కట్టొద్దని, కొత్తగా రుణాలు తీసుకోండని రేవంత్ రెడ్డి ప్రకటించారని, రేవంత్ మాటలను నమ్మి కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతు లను మోసం చేశారన్నారు. నేడు రైతులకు తీసుకున్న అప్పులు చెల్లించలేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు. రైతులు దళారీల దగ్గర మిత్తీలకు అప్పులు తెచ్చుకొని పంటలు పండిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ధాన్యం కొనుగోలు చేయడంలో శ్రద్ధ లేదని, వారికి వసూళ్లకు పాల్పడి ఆ పైసలను ఢిల్లీకి పంపడం పైనే శ్రద్ధ ఉందని ఆరో పించారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక ఉందో రేవంత్ రెడ్డి స్ఫష్టం చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధపు హామీలతో తెలంగాణ రైతులను మోసం చేయడమే వారి ఉద్దేశమా? అని ప్రశ్నించారు. రైతులకు ఆర్థిక సాయం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు కావాల్సిన నిధులు ఏవిధంగా సమకూర్చు కుంటారో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం దళితబంధు పేరుతో దళితుల ను, గిరిజన బంధు పేరుతో గిరిజనులను మాయమాటలతో వెన్నుపోటు పొడిచిందని, ఏ వర్గానికి ఎలాంటి బంధు ఇవ్వలేదని విమర్శించారు. నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఉందని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన పోయి, మరొక కుటుంబ పాలన వచ్చింది, ఒక వసూలు రాజ్యం పోయి, మరొక వసూలు రాజ్యం వచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ. 15 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. కాని ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పా రని, మార్పు అంటే మతిమరుపు మార్పా..? ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే మార్పా..? అని ప్రశ్నించారు. రూ. 2 లక్షల లోపు రైతు రుణాలను తక్షణమే మాఫీ, రూ. 15 వేలు రైతు భరోసా, రైతు కూలీలకు రూ. 12 వేలు, వరికి క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ వంటి హామీలు ఇచ్చారని, ఇంతవరకు అమలు చేయలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు గత ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలులో క్వింటాలుకు గరిష్టంగా రూ.1400 మద్దతు ధర మాత్రమే ఉండేదన్నారు. మోడీ పాలనలో రూ. 2200 మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 26 వేల కోట్ల ఖర్చుతో ధాన్యం కొనుగోలు చేస్తోందని వెల్లడించారు.

ప్రతి బస్తాకు ఇచ్చే సుతిల్, కూలీ, ట్రాన్స్ పోర్ట్ చార్జీలు, రైస్ మిల్లులకు చార్జీలు, రైతు కల్లాల నుంచి మొదలు ధాన్యం ఎఫ్‌సిఐ గోదాంలకు చేరే వరకు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలులో అండగా ఉంటుంటే. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు ధాన్యానికి రూ. 2,200 బోనస్ ఇస్తోందని, కేంద్ర ప్రభుత్వమిచ్చే బోనస్‌తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న రూ.500 బోనస్‌తో కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో జరిగిన అన్యాయాలకు, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంతో రైతులు పుట్టెడు దు:ఖంలో మునిగి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో పరిహాసం చేస్తోందని, ఆ పార్టీ డొల్లతనం బయటపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ బోగస్ డిక్లరేషన్, రైతులకు ఇచ్చిన గ్యారంటీ బోగస్ గ్యారంటీ అని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులకు ఇచ్చిన అన్ని హామీలపై, గ్యారంటీలు అమలు ఏమైందని నిలదీయాలి అని పిలుపునిచ్చారు.

గతంలో దేశంలో కరెంటు కోతలు, ఎరువుల కరువు ఉండేదన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు లేని నవ భారతాన్ని నిర్మించారన్నా రు. వ్యవసాయాని కి, గృహ అవసరాలకు, పారిశ్రామిక రంగంతో పాటు అనేక రకాలుగా విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని వెల్లడిం చారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, చెప్పులు బారులు తీరిన క్యూలైన్లు కనపడేవని, అనేక సార్లు లాఠీచార్జ్‌లు జరిగాయని, రైతులు గుండె పోటుతో చనిపోయిన ఘటనలు ఉన్నాయ న్నారు. మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ చేసిన ఎరువుల బ్లాక్ మార్కెట్‌కు అరికట్టి, నీమ్ కోటింగ్ తో యూరియాను అందిస్తోందన్నారు. రైతులకు యూరియా కొరతలేని భారతదేశాన్ని మోడీ నిర్మించారన్నారు. ప్రపంచంలో యూరియా ధరలు పెరిగాయని, దిగుమతి చేసుకున్న యూరియా తో రైతులపై ఎలాంటి భారం పడకుండా ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని, తక్కువ ధరకే ఎరువులను అందిస్తోందని తెలిపారు. మోడీ ప్రభుత్వం ఒక ఎకరానికి ఏడాదికి రూ. 18 వేలు ఎరువుల సబ్సిడీ రైతులకు అంది స్తోందన్నారు.

కూరగాయల పంటలు, ఫామాయిల్ ఉత్పత్తులను ప్రోత్సహించేలా అగ్రికల్చర్ క్లస్టర్లను ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చిందని తెలిపారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేయకుండా రైతులను నిండా ముంచిందని, ప్రకృతి వైపరీత్యా లతో పంట నష్ట పోయిన రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనను అమలు చేయకుండా బిఆర్ ఎస్ సర్కారు అడ్డుకుందని వెల్లడిం చారు. మోడీ ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2వేలను రైతుల అకౌంట్లో జమ చేస్తోందన్నారు. మోడీ గ్యారంటీ అంటే ఇచ్చిన హమీని అమలు చేసే గ్యారంటీగా అభివర్ణించారు. జాతీయ రహదారుల నిర్మాణం, ఉగ్రవాదం నిర్మూలన, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమంది రం నిర్మాణం వంటి అనేకమైన ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వమేనన్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాకే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారని, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, రాహుల్ గాంధీ తన జీవితంలో ప్రధానమంత్రి కాలేరని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు నెలకు రూ.2500 ఆర్థికసాయం, నిరుద్యోగులకు రూ. 4 వేల చొప్పున భృతి, రూ. 10 లక్షల వైద్య సాయం వంటి అనేక హామీలు ఇచ్చిందని, హామీల అమలులో అతీగతి లేదని విమర్శించారు. అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా అన్ని మండల కేంద్రాల్లో రైతులకు అండగా ఉండేలా బిజెపి నిరసన దీక్షను చేపట్టిందని, సోమవారం రైతు దీక్ష చేపట్టా మన్నారు. రైతులకు అండగా బిజెపి ఉంటుందని, ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు పోరాటం చేస్తామని కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ డిక్ల రేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టో పేరుతో అనేక రకాలుగా 400 పైగా హామీలు ఇచ్చింది.

రూ.2 లక్షలలోపు రైతు రుణాలను తక్షణమే మాఫీ చేయాలి: గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తోందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని, రైతులకు రూ. 15 వేలతో ఆర్థిక భరోసా కల్పిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అమలు చేయంకుండా మోసం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి.

రూ.2లక్షలలోపు రైతు రుణాలను తక్షణమే మాఫీ చేయాలని, రూ.15 వేలు రైతు భరోసా అందించాలని, రూ.12 వేలు రైతు కూలీల అకౌంట్‌లో వేయాలని, వరికి క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ అందించాలని, నష్టపోయిన రైతులకు పంట నష్టం రూ. 25 వేలు పరిహారం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోడీ వ్యవసాయాన్ని పండుగలా మార్చేలా అనేక రాయితీలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. తక్కువ ధరకే ఎరువులు అందించడంతో పాటు కిసాన్ రైలు వంటి అనేక కార్యక్రమాలతో రైతులకు అండగా నిలుస్తున్నారన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

ఎద్దేడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు: కొండపల్లి శ్రీధర్ రెడ్డి
ఎద్దేడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఏ పల్లెకు పోయిన రైతుల కన్నీళ్లే కనపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రైతుబంధు పైసలు పడలేదని కాంగ్రెస్ మంత్రులను అడిగితే, రైతుబంధు పడలేదనన్నవారిని చెప్పుతో కొట్టాలంటూ ఓ మంత్రి అహంకారంతో మాట్లాడిండని గుర్తు చేశారు. రూ. 2 లక్షల రుణమాఫీ తక్షణమే చేస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి అసలు ఆ కార్యాచరణే చేపట్టలేదన్నారు. అతివృష్టి, అనావృష్టితో పంటలు నష్టపోయినప్పుడు మోడీ ప్రభుత్వం రైతులను ఆదుకునేలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చిందన్నారు.

అయితే గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోయారన్నారు. రాష్ట్రంలో నేడు పంటలు ఎండిపోయి నష్టపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని వెల్లడించారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రజల దృష్టిని మరల్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవ హరిస్తోందని, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశంతో రైతుల సమస్యల విషయం నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతుల కు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామ గ్రామన రైతులు బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News