Wednesday, May 1, 2024

వేలం పారదర్శకం

- Advertisement -
- Advertisement -

Kokapet Khanamet land auction in Transparent

కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై అసత్య కథనాలు

నిరాధార ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తాం
ప్లాట్ల ధరలు వేర్వేరుగా ఉండడం వింత కాదు ఆన్‌లైన్‌లో పాటకు 8నిమిషాలు ఇచ్చాం స్విస్ ఛాలెంజ్ పద్ధతి సరికాదు : రాష్ట్ర ప్రభుత్వం

మనతెలంగాణ/హైదరాబాద్ : కోకాపేటలోని నియోపోలిస్, ఖానామెట్ భూముల వేలం పారదర్శకంగా జరిగిందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున హెచ్‌ఎండిఎ, టిఎస్‌ఐఐసిలు చేపట్టిన భూముల వేలంలో విధానపరమైన అవకతవకలు జరిగాయని, కొన్ని వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల గురించి ప్రజలకు తెలియజేయల్సిన బాధ్యత తమపై ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇకముందు నిరాధారమైన ఆరోపణలు చేస్తే పరువునష్టం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. వేలం గురించి నెలరోజలుగా ప్రచారం చేస్తున్నామని, పోటీని నివారించారని, రెవెన్యూ తగ్గించారనే ఆరోపణలు నిరాధారమని తెలిపింది. కొన్ని సంస్థలకే మేలు చేశారన్న ఆరోపణలు నిరాధారమని ప్రభుత్వం పేర్కొంది.

ప్లాట్ల ధరలు వేర్వేరుగా ఉండడంలో ఆశ్చర్యం లేదు

ఆన్‌లైన్‌లో 8 నిమిషాల పాటు వేలం పాటకు అవకాశం కల్పించామని ఆ 8 నిమిషాల పాటు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో బిడ్‌ను ఖరారు చేశామని ప్రభుత్వం పేర్కొంది. ప్లాట్ల ధరలు వేర్వేరుగా ఉండడంలో ఆశ్చర్యం లేదని, భూముల వేలానికి స్విస్ చాలెంజ్ పద్ధతి సరికాదని తెలిపింది. ఈ పద్ధతి పోటీని కొందరికే పరిమితం చేస్తుందని పేర్కొంది. నివాస, వాణిజ్య, సంస్థాగత, ప్రజా అవసరాలకు సంబంధించి ప్రభుత్వ భూములను వేలం వేయడం అనేది ఉమ్మడి రాష్ట్రంలోనూ, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతుందని తెలిపింది. ఢిల్లీలోని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ లాంటి వివిధ రాష్ట్రాలలో ఇలాంటి ప్రక్రియ నిరంతరం జరుగుతున్నాయని పేర్కొంది. పట్టణాల్లో ప్రణాళిక బద్దమైన వృద్ధితో పాటు పట్టణాల్లో రోజు రోజుకు పెరుగుతున్న నివాస, వాణిజ్య సంబంధమైన అవసరాలను తీర్చడం దీని ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.

హైదరాబాద్ మిగతా మెట్రో నగరాల కంటే వేగంగా…

ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మిగతా మెట్రో నగరాల కంటే వేగంగా వృద్ధి చెందుతోందని, ఈ వృద్ధికి అనుగుణంగా సరికొత్త ప్రాంతాల్లో గ్రీన్ ఫీల్డ్ అదనపు నివాస, వాణిజ్య, ఇతర మౌలిక వసతుల కల్పన ద్వారా మాత్రమే నగర భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఒక ప్రణాళికాబద్ధ ్దమైన వృద్ధిని సాధించగలుగుతామని తెలిపింది. కోకాపేట్, ఖానామెట్ భూములు నగరంలో అదనపు నివాస, కార్యాలయ అవసరాలను తీర్చడానికి ఎంతగానో దోహదపడుతాయని తెలిపింది. నగర అభివృద్ధికి దోహద పడే అత్యంత వ్యూహాత్మక ప్రదేశాలైన కోకాపేట్, ఖానామెట్ భూముల వేలాన్ని వాటిని దృష్టిలోపెట్టుకొని చేపట్టడం జరిగిందని తెలిపింది. ఈ వేలం పాటను భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్‌టిసి (MSTC Ltd., e-auction)ఆధారిత ఆన్‌లైన్ బిడ్ పద్ధతి ద్వారా అత్యంత పారదర్శకంగా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఆన్‌లైన్‌లో 8 నిమిషాల పాటని అందరికీ చూపించాం

ఎలాంటి వేలం పాటలోనైన కనీస నిర్ణీత ధర (upset price) నిర్ధారించి వేలంలో పాల్గొనే అవకాశం కల్పించామని, ఆ విధంగా ఈ వేలం పాటలో కనీస నిర్ణీత ధరను ఎకరాకు రూ. 25.00 కోట్లుగా నిర్ణయిస్తూ ఆన్‌లైన్ విధానం ద్వార పాట దారులు రూ. 20.00 లక్షలు, ఆ విలువకు అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పించామని ప్రభుత్వం తెలిపింది. ఆ విధంగా ఎకరాకు రూ. 25.00 కోట్ల కనీస ధర వేలం పాట లో సాధ్యమైనంత ఎక్కువ మంది పాల్గొనేలా చేయాలన్న సదుదేశ్యంతోనే పెట్టడం జరిగిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కనిష్ట ధర నుంచి ఒకొక్క పాట దారు రు. 20.00 లక్షలు, దానికి ఎక్కువగా ఆన్‌లైన్ పద్ధతి ద్వార పాడుకునే వెసులుబాటు ఉండటమేకాక, ఆన్‌లైన్‌లో 8 నిమిషాల పాటని అందరికి చూపించామని అయినా ఎవరూ ముందుకు రాలేదని తెలిపింది.

జూన్ 25వ తేదీన ప్రీ బిడ్ మీటింగ్ సందర్భంగా హాజరైన డెవలపర్స్‌కు అవగాహన

జూన్ 25వ తేదీన ప్రీ బిడ్ మీటింగ్ సందర్భంగా హాజరైన డెవలపర్స్‌కు/ వివిధ సంస్థలకు సమగ్రంగా వివరించడం జరిగిందన్నారు. వారి సందేహాలను సైతం నివృత్తి చేయటం జరిగిందన్నారు. ప్రీ బిడ్ మీటింగ్‌కు రికార్డు స్థాయిలో ఆసక్తి కనబరిచి దాదాపు 80 మంది ప్రతినిధులు హాజరు కావటం ద్వారా ప్రీ బిడ్ మీటింగ్ విజయవంతం అయ్యిందని ప్రభుత్వం తెలిపింది. పైన పేర్కొన్న విధంగా కోకాపేట ఈ ఆక్షన్ అంశాలను వీలైనంత ఎక్కువ మందికి తెలిసేలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తీసుకున్నామని పేర్కొంది.

వ్యక్తులు, సంస్థల వివరాలు తెలియవు

ఆక్షన్ నిర్వహిస్తున్న హెచ్‌ఎండిఏ, టిఎస్‌ఐఐసి వంటి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి వేలం జరుగుతున్న సమయంలో అందులో పాల్గొంటున్న వ్యక్తులు, సంస్థల వివరాలు తెలియవని, ఈ వేలం ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఎంఎస్‌టిసి (MSTC) వెల్లడించే వరకు, ఏ బిడ్దరు, ఏ ప్లాట్ ను కొనుగోలు చేశారన్న విషయం బాహ్య ప్రపంచాయనికి తెలియదని ప్రభుత్వం పేర్కొంది. ఈ వివరాలన్నీ బిడ్ డాక్యుమెంట్ లో సమగ్రంగా పొందు పరుచుతామని, ఈ విషయాలను ప్రీ బిడ్ మీటింగ్‌లో ఎంఎస్‌టిసిఅధికారులు సమావేశానికి హాజరైన వారికి వివరిస్తారని పేర్కొంది. అర్హతలకు లోబడి ఎంఎస్‌టిసి వెబ్‌సైట్‌లో రిజిస్ట్రర్ చేసుకుని ఈ ఆక్షన్‌లో పాల్గొన్న వారిలో ఎక్కువ ధర కోట్ చేసిన బిడ్డర్‌కు ప్లాట్ దక్కుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News