Sunday, April 28, 2024

డగ్స్ దందా.. సినిమా నిర్మాత అరెస్టు

- Advertisement -
- Advertisement -

డగ్స్ ..సినిమా. రాజకీయాలు
తమిళ సినిమా నిర్మాత అరెస్టు
రూ 2000 కోట్ల విలువైన సరుకు రవాణా
మూడు దేశాలలో భారీ స్థాయి రాకెట్
న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో కదిలిన డొంక
ఏజెంట్ల పట్టివేతతో తీగలాగిన వైనం
న్యూఢిల్లీ /చెన్నై: అంతర్జాతీయ, అంతరాష్ట్ర డ్రగ్ రాకెట్‌ను నిర్వహిస్తోన్న తమిళ సినిమా నిర్మాత జాఫెర్ సాధిక్ అబ్దుల్ రెహ్మన్ అలియాస్ బేజోను అరెస్టు చేశారు. ఏకంగా రూ 2000 కోట్ల విలువైన మాదకద్రవ్యాల అక్రమరవాణా కేసుకు సంబంధించి ఈ చిత్ర నిర్మాతపై వేటుపడింది. అంతకు ముందు జరిగిన అరెస్టులు, ఇతరత్రా ఫక్కా సమాచారంతో ఢిల్లీ పోలీసు బృందాలు, నార్కోటిక్ కంట్రోలు బోర్డు (ఎన్‌సిబి) కలిసికట్టుగా వ్యవహరించి జరిపిన ఆపరేషన్ క్రమంలో ఈ అరెస్టు జరిగింది. అరెస్టు అయిన సాధిక్ గతంలో డిఎంకె నేతగా ఉన్నారు. ఐదు తమిళ సినిమాలు తీశారు. ఢిల్లీలో ఇటీవల 50 కిలోల స్యూడోఫెడ్రైన్ అనే మాదకద్రవ్యం రవాణాలో ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు.

వీరిని విచారించిన క్రమంలో జాఫెర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సాధిక్ విస్తృతస్థాయిలోనే డ్రగ్స్ సిండికేట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ఈ సిండికేటు ద్వారా గత మూడు సంవత్సరాల కాలంలో 45 సంచుల మేర మాదకద్రవ్యాలు వివిధ దేశాలకు అక్రమంగా తరలించినట్లు వెల్లడైంది. ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం, ఎన్‌సిబిలు ఈ విషయాన్ని నిర్థారించుకున్న తరువాత సాధిక్‌ను అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ తరలించిన డ్రగ్స్‌లో అత్యధికంగా 3500 కిలోల మేర స్యూడోఫెడ్రైన్ డ్రగ్ ఉంది. సాధిక్‌ను విచారించిన క్రమంలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. తనకు ఈ అక్రమ రవాణాతో భారీ స్థాయిలో డబ్బు వచ్చిందని, దీనిని చట్టబద్ధమైన చిత్రనిర్మాణం, రియల్ ఎస్టేట్, హోటల్స్ వంటి వాటిలో పెట్టుబడులుగా మళ్లించినట్లు, ఆయన అరెస్టును ధృవీకరించిన ఎన్‌సిబి డిప్యూటి డైరెక్టర్ జ్ఞానేశ్వర్ సింగ్ వివరించాడు.

ఈ గ్యాంగ్‌కు చెందిన వారు నార్కోటిక్స్ తయారీకి వాడే కీలక రసాయనాలతో పట్టుబడ్డారు. వీరిని పట్టుకోవడం వల్లనే అంతర్జాతీయ స్థాయి డ్రగ్ రాకెట్ కార్యకలాపాలను ఛేదించడం జరిగిందని అధికారులు తెలిపారు. కాగా సాధిక్‌ను పట్టుకోవడానికి గాలింపు బృందాలకు దాదాపు రెండు వారాలకు పైగా సమయం పట్టింది. ఈ ముఠా అత్యంత చాకచక్యంగా డ్రగ్స్‌ను విమానాలలో, సముద్ర మార్గాలలో నౌకలలో తాము బుక్ చేసుకున్న ప్రాంతాలకు తరలిస్తున్నారని వెల్లడైంది. అధికారులకు, తనిఖీలకు దొరకకుండా డ్రగ్స్‌ను ఎక్కువగా ఆహార ఫుడ్ ప్యాకెట్లలలో, కొబ్బరి పొడులలో అమర్చి రవాణా చేస్తున్నారని తెలిసింది. న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలకు ఎక్కువగా ఈ గ్యాంగ్ డ్రగ్స్ పంపించింది. తమ దేశానికి డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోందని ఆయా దేశాల కస్టమ్స్ విభాగాలు భారత ఉన్నతాధికారులకు తెలియచేశాయి. ఈ క్రమంలో ఆయా దేశాల నుంచి ఇక్కడి కస్టమ్స్, నార్కోటిక్ అధికారులు తగు సాయం తీసుకుంటున్నారు. దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు.

మూడు దేశాల రాకెట్ ..2010 నుంచి రాజకీయాల్లో

డ్రగ్స్ రవాణాతో సంపాదించిన దొడ్డిదారి సొమ్ముతో జాఫెర్ సినిమాలు తీశాడు. కొన్నింటికి తెరవెనుక ఉండి ఫైనాన్స్ చేశాడని వెల్లడైంది. చెన్నై వెస్డ్ డిఎంకె ఎన్నారై వింగ్ నిర్వాహకుడుగా ఉన్నారు. గత నెలలో ఈ డ్రగ్స్ రాకెట్‌లో ఆయన పేరు రావడంతో డిఎంకె పార్టీ వెంటనే ఆయనను సస్పెండ్ చేసింది. ఆయన నిర్మాణంలో మంగాయ్ వంటి సినిమాలు వచ్చాయి. ఆయన తీసిన తమిళ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. డ్రగ్స్ అక్రమ రవాణాలో సాధిక్ కిలోకు రూ 1 లక్ష కమిషన్ పొందేవాడని వెల్లడైంది. అక్రమ సొమ్ముతో ఆయన జెఎస్‌ఎం గ్రూప్ కంపెనీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News