Tuesday, April 30, 2024

సర్వనాశనం చేశారు.. ప్రభుత్వంపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారు.. ప్రభుత్వంపై  పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం భువనగిరి మండలం బండ సోమవారం సబ్ స్టేషన్ కు వెళ్లారు. మంత్రి కెటిఆర్ కు సవాల్ విసిరిన నేపథ్యంలో సబ్ స్టేషన్ లాగ్ బుక్ వివరాలను పరిశీలించారు. అక్కడ పని చేస్తున్న వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ….. ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదు. బండ సోమవారం సబ్ స్టేషన్ లో పని చేస్తున్న బాల నర్సయ్యను ఎలా బతుకుతున్నారని అడిగితే.. అప్పు చేసి బతుకుతున్నామని అన్నాడని ఆయన తెలిపారు.

కెసిఆర్, కెటిఆర్… ఒకసారి బాల నర్సయ్య బాధలు వినండి. రైతులకు 24 కరెంట్ అందడం లేదు. బండ సోమవారం సబ్ స్టేషన్ బుక్ లో అన్ని వివరాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ వాళ్లు పని లేక ధర్నాలు చేశారని మండిపడ్డారు. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియాతో బీఆర్ఎస్ వాళ్లు కోట్లు సంపాదించారని ఆరోపించారు. మనుషులకు డబ్బులు ఇచ్చి నిన్న, మొన్న ధర్నాలు చేశారు. 24 గంటల కరెంట్ అంటున్న కేటీఆర్ ను.. బండ సోమవారం సబ్ స్టేషన్ నుంచి ప్రశ్నిస్తున్నా అని ఆయన వెల్లడించారు.

10, 11 గంటలకు మించి రైతులకు కరెంట్ ఇవ్వడం లేదు. మధ్యలో కట్ కూడా అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 9 గంటల ఉచిత కరెంట్ అందించామని గుర్తుచేశారు. దేశంలో ఉచిత కరెంట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. సబ్ స్టేషన్ రికార్డుల్లో అన్ని వివరాలు ఉన్నాయి. అంటే, కెటిఆర్ అబద్ధం చెప్తున్నారని తేలిపోయిందన్నారు. మీ డిపార్ట్ మెంట్ అధికారే చెప్తున్నాడుగా.. దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు పెరిగిన ప్రజాదరణ చూసి ఓర్వలేక, ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాటకాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ధర్నాను అడ్డుకున్నారని మహబూబ్ నగర్ లో సబ్ మెజిస్ట్రేట్ భర్తపై దాడి చేశారని,ఆఖరికి కానిస్టేబుల్ పైనా దాడికి పాల్పడ్డారు. ఇదెక్కడి న్యాయమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. 80 ఏళ్లు దాటిన వారిని ఉన్నత హోదాల్లో కూర్చోబెడితే ఏం ఉపయోగం. ఒక్క రివ్యూ ఉండదు.. జీతాలు ఇవ్వరు.. ప్రభుత్వం ఉన్నది దేనికి?
విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు.

రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడో తెలిసి తెలియకుండా ధర్నాలు చేస్తారా? ప్రజలను ఇబ్బంది పెడతారా? బీఆర్ఎస్ ధర్నాలతో ట్రాఫిక్ తో హైదరాబాద్ వాసులు ఇబ్బంది పడ్డారు. నాటకాలు ఇకనైనా ఆపండన్నారు. మా థాక్రే ఢిల్లీలో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో 24 గంటల ఉచిత కరెంట్ హామీని పెడతామని చెప్పారు. ఇకనైనా నాటకాలు ఆపి.. ఉండే రెండు నెలలు సక్రమంగా పాలన సాగించాలని సూచించారు. వెంటనే బండ సోమవారం సబ్ స్టేషన్ లో పని చేస్తున్న బాలనర్సయ్యకు జీతం పంపించండి. ఆపరేటర్లే కాదు లక్షల మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల ఇళ్లు ఎలా గడవాలి. బిల్లులు ఎలా కట్టుకోవాలన్నారు. ఇచ్చే 10 గంటల కరెంట్ లో 10 సార్లు పోతుంది. దానికే 24 గంటల కరెంట్ అని చెప్తారా?
త్రీ ఫేజ్, సింగిల్ ఫేజ్ కు సంబంధించిన అన్ని వివరాలు లాగ్ బుక్ లో ఉన్నాయి. దీనికి కేటీఆర్ ఏం సమాధానం చెప్తారో చూద్దామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News