Sunday, May 5, 2024

ఉచిత విద్య, వైద్యం, ఇండ్లపై చట్టం చేయండి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

fKTR About Free Education and Healthcare

మన తెలంగాణ/హైదరాబాద్: నిరుపేదలకు ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం ఇస్తామన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పందించారు. బిజెపి మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా ఉందని, ఉచితాలు వద్దని ఓ పక్క విశ్వగురు (ప్రధాని మోడీ) చెబుతుంటే, మరో పక్క విద్య, వైద్యం, ఇండ్లు ఫ్రీగా ఇస్తామని ఈ జోకర్ ఎంపి హామీలిస్తున్నాడని విమర్శించారు. ఈ దేశాన్ని బిజెపి పాలించడం లేదా? అని ప్రశ్నించారు. ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం అందిస్తామంటే మిమ్మల్ని ఎవరు ఆపారని ట్విట్టర్ వేదికగా నిలదీశారు.
తెలంగాణ బిజెపి ఇస్తున్న ఉచిత హామీలపై పార్లమెంటులో చట్టం చేయాలని ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఉన్న పేదలకు విద్య, వైద్యం, ఇండ్లు ఉచితంగా ఇచ్చేలా చట్టాన్ని తీసుకొస్తే టిఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పేదలకు ఇళ్లు, విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని హామీలు గుప్పించారు.

KTR About Free Education and Healthcare

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News