Wednesday, May 8, 2024

ఆంధ్రాలో పంచాయతీ.. ఆంధ్రాలో తేల్చుకోవాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు ఎపికి చెందిన రాజకీయ సమస్య అని, దానికి మేము స్పందించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మంత్రి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించారు. “ఏపీలో జరుగుతుంది రెండు పార్టీల మధ్య ఘర్షణ. చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు సంబంధం లేదు. చంద్రబాబు న్యాయ పోరాటం చేస్తున్నారు. చంద్రబాబుకు జరగాల్సిన న్యాయం కోర్టుల్లో జరుగుతుంది “బైగాని షాదీ మే అబ్దుల్లా దీవానా” అన్నట్లు చంద్రబాబు ఆంధ్రలో అరెస్ట్ అయితే అక్కడ ధర్నాలు చేయాలి.. కానీ ఇక్కడ ధర్నాలు చేస్తే ఎలా.

పక్కింట్లో పంచాయితీ అయితే ఇక్కడ తీర్చుకుంటాం అంటే ఎలా. ఆంధ్రాలో పంచాయతీ.. ఆంధ్రాలో తేల్చుకోవాలి. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు కాపాడవలసిన బాధ్యత మా మీద ఉంది. హైదరాబాద్ లో ఇక్కడ అందరూ పదేళ్ల నుండి ప్రశాంతంగా ఉన్నారు.. లేని చిచ్చు పెడతమంటే ఎలా. ఓ ఫ్రెండ్ ద్వారా లోకేష్ ఫోన్ చేసి ర్యాలీలు ఎందుకు అడ్డుకుంటున్నారు అని అడిగారు. ఒకరికి అనుమతిస్తే.. వేరే పార్టీకి అనుమతి ఇవ్వాల్సి వస్తుంది. తెలంగాణ ఉద్యమంలోనే ఐటీ ఆక్టివిటీ దెబ్బతినకూడదు అని ఐటీ కారిడార్లో ర్యాలీ చేయలేదు. హైదరాబాద్ వాసులను టిడిపి, వైకాపా పార్టీలు ఇబ్బందిపెట్టడం సరికాదు. వైకాపా, తెదెపాకు తెలంగాణలో ప్రాతినిధ్యం లేదు. ఎపి పంచాయతీలకు తెలంగాణను వేదిక కానివ్వం. మా పార్టీ నేతలు స్పందిస్తే అది వారి వ్యక్తగత అభిప్రాయం” అని కెటిఆర్ పేర్కొన్నారు.

Also Read: ఇంతటి దుర్మార్గమైన ప్రధానిని ఎప్పుడూ చూడలేదు: కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News