Sunday, April 28, 2024

మాట నిలబెట్టుకున్న మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

పంజాబ్ బధిర క్రీడాకారిణి మాలిక హండాకు సాయం

KTR help to punjabi player

మన తెలంగాణ/హైదరాబాద్ : పంజాబ్‌కు చెందిన మూగ చెస్ క్రీడాకారిణి మాలిక హండాకు మంత్రి కెటిఆర్ సోమవారం సహా యం అందించారు. పంజాబ్‌కి చెందిన మాలిక తన అద్భుతమైన చెస్ నైపుణ్యంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు గెలిచినా, తనకు ఎలాంటి సహకారం అందడం లేద ని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆమె సమాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన వైకల్యాన్ని సవాల్ చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిన మాలికకు సహకారం అందించేందుకు మంత్రి కెటిఆర్ ముందు కు వచ్చారు. ఈ మేరకు పంజాబ్‌లోని జలంధర్ నుంచి హైదరాబాద్‌కు పిలిపించి ఆర్థిక సహా యం చేశారు.

ఈ రోజు తాను తన వ్యక్తిగత స్థాయిలో సహాయం చేస్తున్నట్లు తెలిపిన మంత్రి కెటిఆర్, ఇంత అద్భుతమైన నైపుణ్యం ఉన్నప్పటికీ మాలికకు తగిన ప్రోత్సాహం దక్కకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కెటిఆర్ ఆమెకు 15 లక్షల రూపాయల ఆర్థిక సహా యం చేశారు. దీంతోపాటు ఒక లాప్‌టాప్‌ను అ ందించి, ఆమెను సన్మానించారు. మూగ చెవిటి భాషా అనువాదకురాలి సహాయంతో మంత్రి కెటిఆర్ మాలికతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంతరి మాలికకు అభినందనలు తలెఇపారు. ఇప్పటికే తన వైకల్యాన్ని జయించి ప్రపంచాన్ని గెలిచావన్నారు.

మాలిక సాధించిన విజయాలతో ఈ సమాజం గర్వపడుతుందని, మా లిక మరింత సహాయం, ప్రశంసలకు అర్హులన్నా రు. తెలంగాణ ప్రభుత్వం సైతం వైకల్యం కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే పాలసీని తయారు చేస్తున్నదని, దేశంలోనే అత్యుత్తమ పాలసీతో ముందుకు వచ్చేందుకు తనకెదురైన అనుభవాల నుంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. మాలికకు మరింత సహా యం అందించాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సుదూరాన ఉన్న పంజాబ్‌కు చెందిన తన ఆవేదనను చూసి అండగా ఉండేలా సహాయం చేసిన మంత్రి కెటిఆర్‌కి ఈ సందర్భంగా మాలిక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News