Tuesday, May 14, 2024

నూతన విధానాన్ని అమలు చేసిన ఘనత కేటీఆర్‌దే

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ప్రజల ఇబ్బందులు, కష్టాలను తొలగించేందుకు పౌర సేవా కేంద్రం పేరిట మున్సిపల్ నూతన విధానాన్ని అమలు చేస్తున్న ఘనత పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌దని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లోని 33 వ డివిజన్ భగత్ నగర్ క్యాంపు కార్యాలయంలో మేయర్ యాదగిరి సునీల్ రావు సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ పర్యటనకు వచ్చిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగరపాలక సంస్థ లో జరిగి న సమావేశంలో ప్రజల కోసం నగరపాలక సంస్థ చేపట్టిన కార్యక్రమాలను అందిస్తున్న సేవలను అభినందించడం చాలా సంతో షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. కేటీఆర్ తీసుకున్న ప్రతి కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ లో తూచ తప్పకుండ పాటిస్తూ ఆన్ లై న్ పద్దతి ద్వారా పౌర సేవలను ప్రజలకు సులభతరం చేశామన్నారు.

ప్రతి ఆన్ లైన్ సేవలను పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజల ఇబ్బందులు తొలగిస్తున్నట్లు తెలిపారు. నగర పౌరులు ఎవరైనా వారి నల్లా విషయంలో గానీ ఇంటి పన్ను విషయంలో గానీ బర్థ్ అండ్ డెత్ సర్టిఫికేట్ విషయంలో గానీ ధరఖాస్తుల విషయంలో గానీ ఇచ్చిన దరఖాస్తుల పరిష్కార విషయంలో పౌర సేవల కేం ద్రం ఆన్ లైన్ విధానం ద్వారా పూర్తి స్థాయి చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి కేటి రామారావు విజన్ వల్ల చాలా వరకు సర్వీసెస్ లు ఆన్ లైన్ విధానం లోనే జరుగుతున్నాయని తెలిపారు.

గతంలో ఒక మోటేషన్ కావాలంటే సంబంధిత యజమానుని మున్సిపల్ చుట్టు అధికారుల చుట్టు నెలల తరబడి తిరిగిన పరిస్తితి ఉండేదన్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ విధానంలో సెల్ఫ్ అసెస్ మెంట్ ద్వారా ఇంటి నెంబర్లు ఇస్తున్న ఘనత కేటీఆర్ దన్నారు. అంతే కాకుండా మోటేషన్ అనేది ఆస్తి కొనుగోలు చేసిన తర్వత సంబందిత యజమాని వచ్చి నగరపాలక సంస్థ లో ధరఖాస్తు చేసుకుంటే అయ్యేదని ప్రస్తుతం ఆస్తి కొనుగోలు రిజిస్ట్రేషన్ లోనే మోటేషన్ రావడం జరుగుతుందని అది నూతన ఆన్ లైన్ విధానం ద్వారా మంత్రి కేటీఆర్ చొరవతోనే సాధ్యమైందన్నారు.

ఈ విధానం ప్రాపర్టి కొనుగోలు దారులు ఆనందించ తగ్గ విషయమని, ఆన్ లైన్ విధానం సులభతరమైందని తెలిపారు. గతంలో బర్థ్ అండ్ డెత్ సర్టిఫికేట్ కావాలంటే నగరపాలక సంస్థ లో ధరఖాస్తు చేసుకొని సానిటరీ జవాన్ ఎస్త్స్ర లు వె రిఫికేషన్ రిపోర్ట్ ఇస్తే నెలలో సర్టిఫికేట్ జారీ అయ్యేదన్నారు. ప్రస్తుతం మీ సేవలో ధరఖాస్తు చేస్తే నగరపాలక సంస్థ కు రా కుండానే వారం రోజుల్లో సర్టిఫికేట్ జారీ అవుతుందని తెలిపారు.

అంతే కాకుండా ఆన్ లైన్ లోనే ఆస్తి పన్నులు, నల్ల పన్నులు, ట్రేడ్ పన్నులు ఎక్కడున్న ట్రాన్పరెంట్ గా కట్టే సదవకాశం ప్రజలకు దక్కడం మంత్రి కేటీఆర్ చొరవనే అన్నారు. నల్లా కనెక్షన్లకు సంబంధించి కూడ ప్రస్తుతం ఆన్ లైన్ లోనే ప్రొసిడింగ్ జారీ చేస్తావున్నామని తెలిపారు. గతంలో నల్లా కోసం ప్లానింగ్ పేపర్ పెట్టి వేల రూపాయలు ఖర్చు పెట్టి దరఖాస్తు చేస్తే ప్రస్తుతం 1 ధరఖాస్తు ద్వారానే ఆన్ లైన్ పద్దతిలో కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News