Monday, April 29, 2024

నకిలీ విత్తనాలతో రైతన్న జర పైలం

- Advertisement -
- Advertisement -

రాజంపేట్ ః కొందరు దళారుల అత్యాశతో అమాయక రైతులను ఆసరగా చేసుకోని నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటారు. రైతులు తక్కువ ధరకు వస్తున్నాయని తీసుకోని మోసపోతున్నారు. నకిలీ విత్తనాలతో ఆశించిన స్థాయిలో దిగుబడి రాక పోవడంతో అప్పుల పాలవుతున్నారు. ఇలాంటి దళారులను కట్టడి చేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాజంపేట్ మండలంలో నకిలీ విత్తనాల కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు సీడ్ కంపెనిలో 9 బస్తాల విత్తనాలు కోనుగోలు చేశారు.

అయితే తీసుకోచ్చిన తర్వాత తన వ్యవసాయ పొలంలో విత్తనాలు విత్తాడు. విత్తి 15 రోజులు గడుసున్నా ఏంతవరకు మెలవక పోవడంతో సంబంధిత కంపెని యాజమాన్యనికి తనకు జరిగిన అన్యాయం వివరించాడు . అయితే తమ తప్పిదం లేదని కంపెని యాజమాన్యం మెండికేసింది. దీంతో ఎమితోచని రైతు తన మిత్రుల ద్వార అలస్యంగా మీడియాకు, అధికారులకు వివరిస్తానని తెలిపాడు. దీంతో కంగుతిన్న యాజమాని వెంటనే రైతుతో కలసి పరిశీలించి మెలక రాక పోవడానికి గల కారణాలు తెలుసుకోని ఏవరికి ఈ విషయం చేప్పవద్దని మళ్ళీ నీకు వెరే విత్తనాలు ఇస్తామని ఓప్పందం కుదుర్చుకున్నారు.

ఇలా రోజు రోజుకు నకిలీ విత్తనాలతో రైతులు మండలంలో మోసపోతున్నారు. అరికట్ట్టాల్సిన అధికారులు నిద్ర మత్తులో మునుగుతున్నారు. ఇలాంటి సంఘటనలు గత సంవత్సరం మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఓ రైతు మెక్కజోన్న విత్తనాలు సైతం ఇలాగే జరిగింది. విత్తిన 20 రోజుల వరకు మెలక రాక పోవడంతో కంగుతిన్న రైతు సదరు షాపు యాజమానికి వివరించగా తన తప్పితం లేదని మంచి విత్తనాలు ఇచ్చానని తెలిపారు. తాను నష్టపోయానని గమనించిన రైతులు షాపు ఎదుట ఆందోళన చేపట్టడంతో తిరిగి మళ్ళీ విత్తనాలు, ఖర్చులు ఇస్తానని చెప్పడంతో రైతులు శాంతించారు. ఇంత జరుగుతున్న పేరుకే తనిఖీలు చేపడుతన్నాము అని చేప్పడమో కాని అచరణలో ఎక్కడ కూడా తనిఖీలు చేపట్టడం లేదని రైతులు వాపోతున్నారు. నూతన మండలంలో విచ్చల విడిగా ఫర్టిలైజర్ షాపులు వెలిశాయని వారితో అధికారులు కుమ్మక్కు అయి మూడు పూవులు ఆరు కాయాలు వ్యాపారం కొనసాగిస్తున్నరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొండాపూర్, గుండారం, రాజంపేట్, తలమండ్ల, ఆర్గోండ గ్రామాలలో షాపులు వెలిశాయి. పేరు ఒ్కరిది భారం మరోకరితో వ్యాపారాలు నిర్వహిస్తున్న అధికారులు తమకే తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరుపై మండల రైతులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో రైతులు వేసుకునే విత్తనాలపై అవగాహన కల్పించాల్సిన వారు కరువయ్యారు. ప్రైవేట్ కంపెని వారు గ్రామాలలోకి వచ్చి మాయ మాటలతో రైతులకు ఏదో ఓక పేరుతో విత్తనాలు అందించి డబ్బులు దండుకోని వెల్తున్నారు. రైతులు కోనుగోలు చేసిన విత్తనాలకు దుఖానదారులు రశీదులు కూడ ఇవ్వడం లేదన్న అరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైన సంబందిత అధికారులు తనిఖీలు చేపట్టి నకిలీ విత్తనాలను అరికట్టాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News