Saturday, April 27, 2024

దొరలకు.. గల్లీ ప్రజలకు మధ్య ఎన్నికల పోరాటం

- Advertisement -
- Advertisement -

బిక్కనూర్: కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్కనూర్, రాజంపేట మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే జవహర్ లాల్ నెహ్రు అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఇందిరా గాంధీ అణచివేశారని మంత్రి ఆరోపించారు. తెలంగాణ ఇస్తామని 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. కాంగ్రెస్ కు 55 ఏళ్లు అవకాశం ఇస్తే ఎందుకు కరెంట్, నీళ్లు ఇవ్వలేదని కెటిఆర్ ప్రశ్నించారు. ఇందిరాగాంధీ, సోనియాగాంధీతో కొట్లాడిన గడ్డ తెలంగాణ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందిని బలితీసుకున్న బలిదేవత సోనియాగాంధీ అని కెటిఆర్ పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో ఇతర పార్టీలు డబ్బులు ఇస్తే తీసుకొండి.. ఓటు మాత్రం భారసకే వేయాలని సూచించారు. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని కెటిఆర్ ఆరోపించారు. సోనియాను బలిదేవత అని రేవంత్ రెడ్డే అన్నారు అని కెటిఆర్ గుర్తుచేశారు. రాహుల్ చెప్పినట్లు దొరలకు, ప్రజలకు మధ్య పోరామటమిది అని కెటిఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ దొరలకు.. గల్లీ ప్రజలకు మధ్య ఎన్నికల పోరాటం జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఢిల్లీ అహంకారం, ఢిల్లీ దొరలతో కొట్లాడడం మాకు కొత్త కాదు అని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News