Wednesday, May 1, 2024

చదువుకుంటూ పేపర్‌బాయ్‌గా.. జైకి జై కొడుతూ

- Advertisement -
- Advertisement -

KTR lauds Jagtial boy who delivers newspaper

కెటిఆర్ ట్వీట్, విశేష స్పందన
పేపర్ వేస్తే తప్పంటి..
కష్టపడితే ఏం అయితది.. భవిష్యత్తులో నాకు మేలు చేస్తుంది…
చిన్నారి కాన్ఫిడెన్స్‌కి కెటిఆర్ ఫిదా

మన తెలంగాణ/హైదరాబాద్: పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు. తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలనే ఉద్దేశం కావొచ్చు. కొందరు పిల్లలు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు నెత్తికెత్తుకుంటున్నారు. ఎంతో మంది పిల్లలు పాఠశాలలకు హాజరవుతూనే లోకం తెలియని వయసులో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. అచ్చం ఇలాంటి పనే చేస్తున్న ఓ చిన్నారి కథను మంత్రి కెటిఆర్ షేర్ చేశారు. ఈ చిన్నారి ఆత్మవిశ్వాసం, ఆలోచనల్లో స్పష్టత, హావభావాలు నాకు చాలా నచ్చాయి అని మంత్రి ప్రశంసించారు. ఈ వీడియోలోని సంఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న జైప్రకాశ్ అనే బాలుడు ఉదయం పూట పేపర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఓ రోజున ఓ వ్యక్తి.. జై ప్రకాశ్‌ని పలకరించాడు. ఏం చేస్తున్నావ్.. ఎక్కడ చదువుతున్నావ్ అని ప్రశ్నించాడు.

అనంతరం సదరు వ్యక్తి ఈ ఏజ్‌లో నువ్వు పేపర్ వేస్తున్నావ్ ఎందుకు అని ప్రశ్నించగా.. అపుపడు జై ప్రకాశ్ ‘ఏం పేపర్ వేయొద్దా’ అని బదులిచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి చిన్నారి జై ప్రకాశ్‌ని ప్రశంసించి.. చదువుకునే ఏజ్‌లో పనిచేస్తున్నావ్ కదా అంటే.. అందుకు జై ‘చదువుకుంటున్నా.. పనిచేస్తున్నా.. దానిలో తప్పేం ఉంది’ అని జవాబిస్తాడు. ఈ ఏజ్‌లో నువ్వు ఇలా కష్టపడటం చాలా నచ్చింది అని సదరు వ్యక్తి అనగా.. ‘కష్టపడితే ఏం అయితది.. భవిష్యత్తులో నాకు మేలు చేస్తుంది’ అని సమాధానం ఇస్తాడు జై. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు చిన్నారి జైని ప్రశంసిస్తున్నారు. పిల్లలు, పెద్దలు నిన్ను చూసి నేర్చుకోవాలని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోని 5 వేల మందికి పైగా లైక్ చేయగా.. 900 మందికి పైగా ట్వీట్ చేశారు. మంత్రి కెటిఆర్ పుణ్యమా అని ఒక్క రోజులో జై ప్రకాశ్ స్టార్ అయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News