Wednesday, May 1, 2024

యాదగిరిగుట్ట అప్పుడెట్లుండే.. ఇప్పుడెట్లుంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

50ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని..కానీ, కేవలం తొమ్మిదన్నర ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని కేటీఆర్ అన్నారు. రైతులకు 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మీ, షాదిముబాకర్ వంటి ఎన్నో సంక్షేమ పథకాల బీఆర్ఎస్ అమలు చేసిందని చెప్పారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతకు మద్దతుగా కేటీఆర్ యాదగిరి గుట్టలో రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.1000కోట్లతో యదగిరిగుట్టను కేసీఆర్ అభివృద్ధి చేశారని.. 2014లో యాదగిరిగుట్ట ఎట్లుండే.. ఇప్పడు ఎట్లుందో ఆలోచించాలని అన్నారు. కాంగ్రెస్ వస్తే.. రాష్ట్రంలో మళ్లీ కరెంటు కష్టాలు వస్తాయని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే.. మళ్లీ కేసీఆర్ సీఎం చేయాలని చెప్పారు.

గెలిచిన తర్వాత సౌభాగ్యలక్ష్మీ పథకం ద్వారా రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు రూ.3000లు ఇస్తామని, వంట గ్యాస్ సిలిండర్ ను రూ.400లకే ఇస్తామని ఆయన చెప్పారు. ఇక, పింఛన్ రూ.5వేలకు పెంచుతామని కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఇవన్ని జరగాలంటే గొంగిడి సునీతను గెలిపించాలని కేటీఆర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News