Sunday, April 28, 2024

గ్రేటర్‌లో 12న ఉచిత నీటి సరఫరా

- Advertisement -
- Advertisement -

గ్రేటర్‌లో 12న ఉచిత నీటి సరఫరా

బోరబండలో మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం

KTR to Start free water supply from Jan 12th in GHMC

మన తెలంగాణ/ సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో సిఎం కెసిఆర్ ఇచ్చిన ఉచిత మంచినీటి సరఫరా హామీని అమలు చేసేందుకు ఈనెల 12న బోరబండలో మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తున్నారు. నీటి సరఫరాకు సంబంధించిన కార్యక్రమాలు వేగం చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 10లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయని, హైదరాబాద్ నగరంలో తప్ప దేశంలో ఎక్కడ ఉచితంగా నీటి సరఫరా చేయడంలేదన్నారు. వరదల వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు రూ. 10వేలు చెల్లించామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బిజెపి రూ. 25వేలు ఇస్తామని చెప్పారు. కానీ నేటి వరకు ఎక్కడ ఇవ్వలేదన్నారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్య పెట్టి ఓట్లను దండుకున్నారని విమర్శించారు.20వేల లీటర్లు లోపు నీరు ఉచితంగా సరఫరా చేస్తామని, డిసెంబర్ నెల నుంచి వారికి నెల వారీ బిల్లులు ఉండవని, గ్రేటర్ పరిధిలో ఉన్న నీటి కనెక్షన్లలో 90శాతం కనెక్షన్లు ఉచిత నీటి పథకం పరిధిలోకి వస్తాయని చెప్పారు.

జలమండలి గత ఐదేళ్ల నుంచి ప్రతి నెల రూ.40కోట్ల లోటు బడ్జెట్ ఉన్న నగర ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా సకాలంలో సరఫరా చేస్తున్నారు. బోర్డులకు నెలకు రూ.160 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, ప్రస్తుతం రూ.120 కోట్లు వసూలైతున్నాయి. వీటితోనే ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణతో పాటు ఇతర్రతా ఖర్చులకు వినియోగిస్తున్నారు. మరో పక్క బోర్డు అధికారులు శివారు ప్రాంతాలకు చెందిన ఏడు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు ఉచిత నీటి సరఫరాపై కూడా సమాలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అక్కడి ప్రజాప్రతినిధులు సాధ్యసాధ్యాలను పరిశీలించాలని కోరుతున్నారని వెల్లడిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి కనెక్షన్ కోసం చేసిన దరఖాస్తులు పరిశీలించి అనుమతి ఇస్తే మరో రూ. 2కోట్లవరకు ఆదాయ రావచ్చంటున్నారు.అదే విధంగా అక్రమంగా ఉన్న కనెక్షన్లు తొలగిస్తే నీటి వృథాకు చెక్‌పెట్టవచ్చని భావిస్తున్నారు. ఈఏడాది కురిసిన భారీ వర్షాలకు నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. దీంతో రెండేళ్ల వరకు నీటి సరఫరా సకాలంలో చేయవచ్చని చెబుతున్నారు. కృష్ణా, గోదావరి నుంచి తరలించే నీటి సరఫరాలో కొంత ఆదా అవుతుందని వివరిస్తున్నారు. ఈనెల 12 నుంచి ఉచిత నీరు పథకం ప్రారంబించడంపై నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

KTR to Start free water supply from Jan 12th in GHMC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News