Tuesday, May 14, 2024

రమణ పార్టీలో చేరడం సంతోషకరం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

L Ramana Joining in TRS Party

హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారానికి ఎల్.రమణ పార్టీలో చేరారని సిఎం కెసిఆర్ తెలిపారు. ప్రగతిభవన్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కొనసాగుతోంది. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషకరమని కెసిఆర్ అన్నారు. టిఆర్ఎస్ చేనేత వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదన్న లోటు రమణతో తీరిందని ఆయన పేర్కొన్నారు. చేనేత సామాజిక వర్గం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు రైతు బీమా కోసం ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. టిఆర్ఎస్ పథకాలు ప్రతి గ్రామంలో ప్రజల ప్రత్యక్ష అనుభవంతో ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ప్రజలు అవకాశం ఇచ్చారు. చిన్న తప్పు దొర్లితే కొన్ని తరాలకు దెబ్బకోడుతుంది. అజెండా ప్రకారం మార్గదర్శకాలు రూపొందించి ముందుకెళ్తున్నామని సిఎం కెసిఆర్ వెల్లడించారు.

L Ramana Joining in TRS Party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News