Wednesday, May 1, 2024

లలితా జువెల్లరీలో అమ్మకాలకు విశేష స్పందన..

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ : అక్షయ తృతీయ సందర్భంగా సోమాజిగూడలోని లలితా జూవెల్లరీలో సందడినెలకొంది. అక్షయ తృతీయను పురస్కరించుకుని జువెల్లరీని ఉదయం 6.30 గంటలకు తెరవడంతో బంగారం కొనుగోలు చేసేవారు క్యూకట్టారు. సరసమైన ధరకు, మన్నికగల బంగారు ఆభరణాలు లభిస్తున్నాయని కొనుగోలుదారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్షయ తృతీయ పురస్కరించుకుని సోమాజిగూడ లలితా జువెల్లరీ దుకాణంలో బంగారం కొనుగోలు చేసేందుకు ఆదివారం మహిళలు పోటెత్తారు.

ఈ సందర్భంగా లలితా జ్యువెల్లరీలో ఏర్పాటు చేసిన అమ్మకాలు, ప్రదర్శనలో వివిధ రకాల డిజైన్లను తిలకించేందుకు బంగారం ప్రియులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బంగారం అమ్మకాలలో మరింత ప్రత్యేకతను చాటుకున్న లలితా జ్యూవెల్లరీ దుకాణంలో బంగారం కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ జంట నగరాలలోని నలు మూలల నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా బంగారం ప్రియులు వేలాది మంది రాకతో సోమాజిగూడ బ్రాంచ్ కళకళలాడుతోంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలుకు ఆఫర్లు పెట్టడంతో లలితా జువెల్లరీ దుకాణానికి బంగారం ప్రియులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

డిజైన్లు బాగున్నాయి:రూప, కృష్ణానగర్
లలితా జువెల్లరీలో బంగారం వస్తువుల డిజైన్లు చాలా చాలా బాగున్నాయి. మిగతా దుకాణాలలో కూలీ తదితర చార్జీలతో ధర ఎక్కువగా ఉంటుంది. తరుగు లేకపోవడంతో బంగారం కొనుగోలు చేసే వినియోగదారులకు కొంత డబ్బు ఆదా అవుతోంది. దీని వల్ల ఎక్కువ బంగారం కొనుగోలు చేయడానికి వీలుంటుంది. మేము 2చైన్లు కొనుగోలు చేశాం.

రీజనబుల్ ధరలకే బంగారం: స్రవంతి, ఉప్పల్
బంగారం కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నాణ్యతతో పాటు ధర కూడా రీజనబుల్‌గా ఉంటే బాగుంటుందని అనిపిస్తోంది. లలితా జ్యువెల్లరీలో బంగారం నాణ్యతగా ఉండటమే కాకుండా ధర కూడా రీజనబుల్ గానే ఉంది. హారంతో పాటు మరో రెండు వస్తువులను కొనుగోలు చేశాం. అక్షయ తృతీయ పురస్కరించుకుని బంగారం కొనుగోలు చేయడం సంతోషంగా ఉంది.

మూడో సారి వచ్చాను: లక్ష్మీప్రసన్న, హనుమకొండ
మాది హనుమకొండ పట్టణం. లలితా జ్యూవెల్లరీలో బంగారం వస్తువులు, డిజైన్లు చాలా బాగా నచ్చాయి. ఇప్పటికే లలితా జ్యూవెల్లరీలో మూడో సారి కొనుగోలు చేయడం. ఈ ఏడాది రూ. 2 లక్షలతో చైన్, హారం, రింగ్ కొనుగోలు చేశాను. లలితా జ్యూవెల్లరీలో బంగారం కొనుగోలు చేయ డం ఇది మూడో సారి. ఇక్కడ బంగారం కొనుగోలు చేయ డానికి మళ్లీ మళ్లీ రావాలని అన్పిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News