Sunday, April 28, 2024

ముందస్తు లాక్‌డౌన్ గ్రేట్.. అన్‌లాక్ నిర్లక్ష్యంతో చేటు

- Advertisement -
- Advertisement -

Lancet mixed reaction to India's attitude towards Covid

 

కొవిడ్‌పై భారత్ వైఖరి పట్ల లాన్సెట్ మిశ్రమ స్పందన
అత్యధిక జనాభా దేశం అయినా నియంత్రణ బాగుంది
మితిమీరిన విశ్వాసంతో ముప్పు పొంచి ఉంది

లండన్/న్యూఢిల్లీ : భారతదేశంలో కోవిడ్ 19 నివారణ, పరిస్థితి నిర్వహణ చర్యలను ప్రముఖ వైద్య విజ్ఞాన పత్రిక లాన్సెట్ కొనియాడింది. అయితే కోవిడ్ ముప్పు ఇప్పటికీ పొంచి ఉందని తెలిపింది. వైరస్ సంక్రమణపు తొలిదశలోనే ముందస్తు లాక్‌డౌన్, తరువాతి దశలలో పూర్తి స్థాయిలో సామూహిక పరీక్షలు, అన్నింటికీ మించి వ్యాక్సిన్ తయారీకి చొరవ వంటివాటిలో భారత్ బాగా వ్యవహరించిందని తెలిపారు. అయితే ఇదే సమయంలో కోవిడ్ నిర్వహణలో కొన్ని లొసుగులు కూడా ఉన్నాయని విశ్లేషించారు. భారత్‌లో కోవిడ్ 19 ః తప్పుడు ఆశాభావం శీర్షికతో ఈ పత్రిక సంపాదకీయం వెలువరించింది. భారత్ వైఖరిపై మిశ్రమ స్పందనగా ఈ సంపాదకీయం ప్రచురించారు. ప్రస్తుతం ఇండియాలో కోవిడ్ ప్రమాదకర దశ ఉందని విశ్లేషించారు.

పలు ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకున్నారు. అన్ని దేశాలకంటే లాక్‌డౌన్ ఇతర చర్యలతో స్పందించారని తెలిపారు. అతిపెద్ద దేశం, పైగా పూర్తి వైవిధ్యత, భిన్నత్వపు వైఖరుల ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని పలు చర్యలు తీసుకున్నారు. కరోనా నుంచి నివారించుకోవడం ఓ ఎత్తయితే, మరో వైపు కరోనా వ్యాక్సిన్ తయారీ దిశలో అగ్రగామిగా ఉంటోందని లాన్సెట్ అభినందించింది. దేశంలో సమర్థవంతమైన టీకామందు తయారీకి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇంకో అంతర్జాతీయ స్థాయిలో వ్యాక్సి న్ రూపకల్పనకు ముందుకు వస్తున్న కంపెనీల ఫార్మూలాలకు అనుగుణంగా ఇక్కడి సీరం ఇనిస్టూట్, భారత్ బయోటెక్ వంటివి తయారు చేయడానికి రంగం సిద్ధం అయిందని, ఇది వైరస్ వ్యాప్తిని నిలిపివేసేందుకు సరైన మార్గం గా ఉంటుందని ఈ బ్రిటిష్ మెడికల్ జర్నల్ తెలిపింది.

అన్‌లాక్‌తో ముప్పు వాకిట్లో

దేశంలో క్రమేపీ కోవిడ్ అన్‌లాక్ ప్రక్రియలు ఆరంభం కావడంతో వైరస్ పునః విజృంభణకు దారితీసిందని, ఇది విపత్తు అని లాన్సెట్ విశ్లేషించింది. కరోనా అదుపులోకి వస్తుందనే ఆశాభావం, దీనితో అత్యుత్సాహంతో సడలింపుల వల్ల వైరస్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. సరైన రీతిలో మాస్క్‌లు, భౌతికదూరాలు పాటించాలనే పద్ధతులపై ప్రచారం లేకుండానే ఆంక్షల ఎత్తివేతతో పరిస్థితి చేజారుతోందని అభిప్రాయపడ్డారు. అయితే వివిధ అంశాల ప్రాతిపదికన చూస్తే ఇండియాను పలు విధాలుగా కోవిడ్ విషయంలో అభినందించి తీరాల్సి ఉందని విశ్లేషించారు. ముందస్తు లాక్‌డౌన్, దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మెచ్చుకుంది. పూల్ టెస్టింగ్‌లు, ఈ ప్రక్రియలో భాగంగా రక్తపు ఇతరత్రా నమూనాలను భారీ స్థాయిలో సేకరించి, పరీక్షలు నిర్వహించడం, సమగ్రమైన ఆర్‌టి పిసిఆర్ టెస్టు కిట్స్ వాడటం, ఈ గ్రూప్ టెస్టింగ్‌తో శీఘ్రగతిన వైరస్ సంక్రమణనలను గుర్తించి, తగు విధంగా నివారణలకు వీలేర్పడిందని తెలిపారు. వ్యాక్సిన్ విషయంలో సమగ్ర పరిశోధనలకు దిగడం చాలా మంచి పరిణామం అని పేర్కొన్నారు. ప్రత్యేక వైద్య పరికరాలతో చికిత్సలకు ఏర్పాట్లు చేయడం, వెంటిలేటర్ల వంటి వాటితో రోగులకు కృత్రిమ శ్వాసను అందించడం వంటివి వైద్య పరంగా గణనీయ పరిణామాలని తెలిపారు.

నిర్లక్ష్యంతో మైనస్ పాయింట్లు

ముందు జాగ్రత్తలు తీసుకోకుండా, మితిమీరిన విశ్వాసంతో వ్యవహరించడంతో ఇప్పుడు ముప్పుతో కూడిన వాతావరణం నెలకొందని లాన్సెట్ తెలిపింది సరైన సాక్షాలు ప్రాతిపదికలు లేకుండానే భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) కోవిడ్ చికిత్సకు హైడ్రోక్సిక్లోరోక్విన్ వంటి వాటి వాడకాన్ని ప్రోత్సహించడం. ఆర్థిక మందగమనం మరింతగా తలెత్తింది. ఈ దశలోనే వలస కూలీల సంక్షోభం సంభవించింది. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ఇండియా ముందస్తు స్పందనలతో కోవిడ్ 19 నివారణలో పాజిటివ్ వాతావరణంతో ఉందని ప్లస్‌మార్క్‌లు వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News