Monday, April 29, 2024

జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఒక్కడోసుతో సత్ఫలితాలు

- Advertisement -
- Advertisement -

Johnson and Johnson vaccine has good results with one dose

 

60 వేల మందిపై తుది దశ ట్రయల్స్ ప్రారంభం

న్యూయార్క్ : అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఒకే ఒక్కడోసుతో బలమైనరోగ నిరోధకశక్తిని ఉత్పత్తి చేస్తుందని ట్రయల్స్‌లో రూఢి అయినట్టు మధ్యంతర ఫలితాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. ప్రారంభ దశ నుంచి మధ్యస్థ దశ వరకు ఈ ప్రయోగాలు నిర్వహించారు. ఎడి 26.కొవ్2.ఎస్ గా పిలిచే ఈ ఒకే ఒక వ్యాక్సిన్ డోసు రెండు డోసుల వ్యాక్సిన్‌తో సమానంగా ఫలితాలను అందిస్తుందని రుజువైంది. అమెరికా ప్రభుత్వ సహాయంతో మోడెర్నా, ఫిజెర్ సంస్థలు దాదాపు వెయ్యిమంది వాలంటీర్లపై ట్రయల్స్ నిర్వహించగా ఉత్తమ ఫలితాలు కనిపించాయి. జులై లోనే ఒకే ఒక డోసుతో కోతులపై ప్రయోగాలు చేశారు. ఇప్పుడు మనుషులపై ట్రయల్స్ చేపట్టారు. ఈ ఫలితాల ఆధారంగా జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ బుధవారం మానవులపై తుది దశ ప్రయోగాలు ప్రారంభించారు.

అమెరికా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూల్లో మొత్తం అరవై వేల మంది వాలంటీర్లపై తుది దశ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. . ఈ మూడో దశ ట్రయల్స్ ఫలితాలు ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది ప్రారంభానికి వస్తాయని సంస్థ ఆశిస్తోంది.మెడికల్ వెబ్‌సైట్ మెడ్ ఆర్‌ఎక్స్‌ఐవి లో మొదటి రెండు దశల ట్రయల్స్ ఫలితాలు వెలువడ్డాయి. అయితే వీటిని ఇంకా పూర్తిగా సమీక్షించలేదు. ఇంతవరకు ట్రయల్స్‌లో పాల్గొన్న వారి నుంచి లభించిన 98 శాతం డేటా బట్టి మధ్యంతర సమీక్ష నిర్వహించగా వ్యాక్సిన్ ఇచ్చిన 29 రోజుల తరువాత యాంటీబాడీలు తటస్థీకరణ అయినట్టు తేలిందని జాన్సన్ అండ్ జాన్సన్‌తోపాటు యూనిట్ జనస్సెన్ ఫార్యాక్యూటికల్స్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఏదెలాగున్నా కేవలం 15 మంది (65 ఏళ్లు పైబడినవారు) నుంచి వ్యాధి నిరోధక శక్తి స్పందన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.

ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్లలో అలసట, కండరాల నొప్పులు వంటి ప్రతికూల ఫలితాలు 64 శాతం యువతలో కనిపించగా, 65 ఏళ్లు పైబడిన వాలంటీర్లలో 36 శాతం మాత్రమే ప్రతికూల ఫలితాలు కనిపించాయని అయితే వ్యాధి నిరోధక శక్తి మాత్రం వృద్ధులో తగినంతగా ఉండకపోవచ్చని వివరించారు. అయితే అనుకున్న ఫలితాలు ఆశించాలంటే మూడో దశ ట్రయల్స్ నిర్వహిస్తేనే తెలుస్తుందని హార్వర్డ్ టి.హెచ్. చాన్‌స్కూల్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ ప్రొఫెసర్ డాక్టర్ బారీ బ్లూమ్ అభిప్రాయ పడ్డారు. తుది దశ ప్రయోగాలు విజయవంతమైతే ఈ ఏడాది ఆఖరులో లేదా వచ్చేఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తుందని జాన్సన్ అండ్ జాన్సన్ ఆశిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News